Mukesh Ambani: కళ్లు చెదిరే విల్లా.. వసతులు చూస్తే మైండ్ బ్లాంక్.. దుబాయిలో ముఖేశ్ అంబానీ కొత్త ప్రొపర్టీ..

మనం ఏదైనా ప్రొపర్టీ కొంటే ఓ రెండు బెడ్ రూమ్లు, మంచి వెంటిలేషన్, విశాలమైన గదులు ఉంటే చాలు అనుకుంటాం.. కాని కుబేరులు ప్రొపర్టీలు చూస్తే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆవిశాలమైన భవంతుల్లో..

Mukesh Ambani: కళ్లు చెదిరే విల్లా.. వసతులు చూస్తే మైండ్ బ్లాంక్.. దుబాయిలో ముఖేశ్ అంబానీ కొత్త ప్రొపర్టీ..
New Villa Ambani
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 29, 2022 | 1:41 PM

Mukesh Ambani: మనం ఏదైనా ప్రొపర్టీ కొంటే ఓ రెండు బెడ్ రూమ్లు, మంచి వెంటిలేషన్, విశాలమైన గదులు ఉంటే చాలు అనుకుంటాం.. కాని కుబేరులు ప్రొపర్టీలు చూస్తే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆవిశాలమైన భవంతుల్లో వసతులే వేరు. మన దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త, భారత అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ముంబయి భవంతి గురించి ఇప్పటికి మాట్లాడుకుంటూను ఉంటాము. ఇప్పుడు మరోసారి ముఖేశ్ అంబానీ చర్చల్లో నిలిచారు. ఇటీవల దుబాయిలో రూ.640 కోట్లు ఖర్చుపెట్టి విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం ఈలగ్జరీ విల్లాను కొనుగోలు చేశారంట ముఖేశ్ అంబానీ. దుబాయిలోని సముద్ర తీరంలో అంబానీ కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన విల్లాను అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ డీల్‌ గా తెలుస్తోంది. గత ఏడాది పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కోసం లండన్ లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ముఖేశ్ అంబానీ తాజాగా చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయిలోని పామ్‌ జుమైరాలో లగ్జీరీ విల్లాను కొనుగోలు చేశారు.

ఈఏడాది ప్రారంభంలోనే ఆయన ఈవిల్లా కొనుగోలుచేసినప్పటికి.. ఈవార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు డీల్‌ కావడంతో దీన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు ఇటీవల ఓ వార్తా సంస్థ వెలువరించింది. భారత్ కు చెందిన బిలియనీర్ అంటూ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఈ విల్లాను తమకనుగుణంగా మార్చుకోవడంతో పాటు, భద్రత కోసం అంబానీలు మరిన్ని కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈవిలాసవంతమైన భవనంలో వసతులు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చెట్టు ఆకారంలో ఉండే పామ్‌ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్‌ సైడ్‌ లగ్జరీ విల్లాను ముఖేశ్ అంబానీ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈవిల్లాలో 10 బెడ్ రూమ్స్, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి. ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్‌ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ నివాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ధనవంతులకు సంబంధించిన విల్లాలు ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని అతిపెద్ద భవంతిని దాదాపు రూ.592 కోట్లతో అంబానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇది పెద్ద కుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా చిన్న కుమారుడు అనంత్‌ కోసం దుబాయిలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. ఇక కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో మరో విల్లాను ముఖేశ్ అంబానీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోదంఇ. 65 ఏళ్ల ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆకాశ్‌ను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గానూ నియమించారు. వారసులకు అదిరిపోయే బహుమతులు ఇవ్వడం కోసం ఈవిల్లాలు అంబానీ కొన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!