Viral Video: కాళ్ల కింద భూమి కంపించిపోవడం అంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది
ఈ వీడియో చూస్తే.. నిజంగానే మీ గుండె ఝల్లుమంటుంది. స్థానికుల అప్రమత్తతతో ఓ మహిళ క్షణాల వ్యవధిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ వీడియో దిగువన చూడండి.
Andhra Pradesh: ఒక్క క్షణం.. ఒక్క క్షణం చాలు.. అంతా తల్లకిందులైపోవడానికి. అప్పటివరకు అంతా బానే ఉంటుంది. కానీ ప్రమాదం ఒక్కసారిగా దూసుకువస్తుంది. ఫేట్ బాగుంటే బయటపడతాం. లేదంటే.. ప్రమాదాల బారిన పడిపోతాం. మనం ఊహించని విధంగా మనం నిల్చున్న నేల.. అదే పాతాళం నుంచి కూడా ప్రమాదం ముంచుకురావొచ్చు తాజాగా మీ ముందుకు అలాంటి ఓ రీజనల్ ట్రెండింగ్ వీడియోనే తీసుకువచ్చాం. మహిళ రెప్పపాటులో ఎలా ప్రమాదం నుంచి బయటపడిందో చూస్తే ఒక్కసారిగా గుండె ఝల్లుమంటుంది. ముందుగా వీడియో వీక్షించండి.
చూశారు కదా.. కాళ్ల కింద భూమి కంపించుకుపోవడం అంటే ఇదేనేమో. అదృష్టవశాత్తూ ఆ టైమ్‌లో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆమెకు సాయం అందించి కాపాడారు. ఆ తర్వాత కొద్ది సెకనల్లోనే వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. రెప్పపాటులో ఆ మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గం యల్లనూరు మండలంలో చిత్రావతి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని సింగవరం గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. అదే సమయంలో ఓ మహిళ రోడ్డును దాటుతుండగా క్షణాల్లో రోడ్డు కుంగిపోయింది. చాలా లక్కీగా ఆమె అడుగు దాటిన మరుక్షణంలోనే రోడ్డు కుంగిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..