ఈ డ్రైవర్ తెలివికి దండం పెట్టాల్సిందే.. పని చేయని వైపర్ తో ఏం చేశాడో తెలిస్తే వావ్ అనాల్సిందే..
అవసరం అనేది ఆవిష్కరణకు తల్లి లాంటింది. అనే సామెతను నిజం చేస్తూ కొందరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారుతున్న కాలంలో ప్రజలు తమ పనిని చేసుకునేందుకు సులభమైన..
అవసరం అనేది ఆవిష్కరణకు తల్లి లాంటింది. అనే సామెతను నిజం చేస్తూ కొందరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారుతున్న కాలంలో ప్రజలు తమ పనిని చేసుకునేందుకు సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈజీగా పని పూర్తయ్యేలా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. కొన్ని సార్లు వారు చేసే టెక్నిక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో ఇంటర్నెట్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక డ్రైవర్ బస్సు అద్దాలను తుడిచే వైపర్ ను చిన్న టెక్నిక్ సహాయంతో సులభంగా ఉపయోగించుకునే విధానాన్ని చూడవచ్చు.
ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను తాడు తో కడతాడు. దానిని వైపర్ విండ్‌షీల్డ్‌కు అమరుస్తాడు. బస్సులో కూర్చున్న డ్రైవర్ తాడును లాగగానే బాటిల్ సహాయంతో దానంతట అదే అద్దాలను క్లీన్ చేసుకునేలా కొత్త ఆవిష్కరణ చేశాడు. ఈ వీడియోను @VipinRathaur అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు తొమ్మిది వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది కూడా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్‌లు ఇచ్చారు.
उत्तर प्रदेश परिवहन निगम की बस में जुगाड़ से चलता वाइपर ?@UPSRTCHQ @UPSRTC_Meerut pic.twitter.com/IOofdiNbRE
— Vipin Rathaur (@VipinRathaur) October 9, 2022
వీడియోపై వ్యాఖ్యానిస్తూ ‘ఈ ఆలోచన నిజంగా సృజనాత్మకమైనది, ఉపయోగకరమైనది.’, ‘డ్రైవర్ తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణీకులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు సహాయపడుతుందని’ కామెంట్లు చేస్తున్నారు.