Video Viral: అమ్మబాబోయ్.. ఇదెక్కడి పిజ్జా అండి బాబూ.. ఈ వీడియో చూస్తే తినాలనే కోరికే లేకుండా పోతుంది..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు వైరల్ అవుతున్న విషయాలు రేపటి నాడు కనుమరుగుకావచ్చు. కానీ కొన్ని వీడియోలు మాత్రం నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తాయి. ప్రస్తుతం..

Video Viral: అమ్మబాబోయ్.. ఇదెక్కడి పిజ్జా అండి బాబూ.. ఈ వీడియో చూస్తే తినాలనే కోరికే లేకుండా పోతుంది..
Choco Ice Cream Pizza
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:31 AM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు వైరల్ అవుతున్న విషయాలు రేపటి నాడు కనుమరుగుకావచ్చు. కానీ కొన్ని వీడియోలు మాత్రం నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తాయి. ప్రస్తుతం బుల్లెట్లు బండి డ్యా్న్స్, ఒక్క మాట చెప్పనా బంగారం.. వంటి వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్నెట్ లో చాలా రకాల వీడియోలు ఉంటాయి. వీటిలో అధికంగా డ్యాన్స్, స్టంట్స్ చేయడం, కుకింగ్ వంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చేసే ప్రయోగాలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. మ్యాగీ, మోమోస్ వంటి వంటకాలతో చేసే ప్రయోగాలు మీరు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి పిజ్జాతో కూడా వెరైటీ ఫుడ్ ట్రై చేశాడు. అతడి చర్యను చూసిన పిజ్జా ప్రియులు తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. పిజ్జా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. జున్ను, మొక్కజొన్న, పుట్టగొడుగులు, పనీర్‌తో తయారైన ఈ పదార్థాన్ని తినేందుకు భోజన ప్రియులు ఆబగా ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పిజ్జా సాస్‌కు బదులుగా చాక్లెట్, చీజ్‌కు బదులుగా ఐస్‌క్రీమ్ వేసి పిజ్జా తయారు చేశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RJ Rohan (@radiokarohan)

ఈ క్లిప్ లో ఒక వ్యక్తి మొదట చాక్లెట్ సాస్‌ను పిజ్జా బేస్‌పై అప్లై చేసి, ఆపై కూరగాయలను పెడతాడు. దీనిని ఓవెన్ లో ఉంచి, పిజ్జా తయారు చేస్తాడు. అనంతరం పిజ్జాపై వెనిల్లా ఐస్ క్రీం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం యాడ్ చేస్తాడు. ఈ వీడియోను రేడియోకారోహన్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని వేలాది మంది వీక్షించగా చాలా మంది లైక్ చేశారు. వైరల్ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘తిండిని వదిలేయండి, ఇది చూడటానికి అసహ్యంగా ఉంది’ అని మరొక వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి