Viral video: తండ్రి అలా.. కొడుకు ఇలా.. స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం.. దీనికి బాధ్యత ఎవరు..?
ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్ల్యక్షం రాహుల్ కుమార్‌ని సెప్టెంబర్ 10 అర్థరాత్రి బలి తీసుకుంది.
ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్ నిర్ల్యక్షం రాహుల్ కుమార్‌ని సెప్టెంబర్ 10 అర్థరాత్రి బలి తీసుకుంది. అతివేగంతో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ కారును నడపడంతో డ్రైవర్ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టాడు. ఆ తరువాత కారును అక్కడే వదిలేసి ఉడాయించాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాహుల్ స్నేహితుడు పవన్ కుమార్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.నిందితుడు ఇంటర్ విద్యార్థి, మైనర్ బాలుడు. కారులో నిందితుడితోపాటు, అతని స్నేహితుడు, మరో విదేశీ పౌరుడు కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు కోట్లాది రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్టయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు, తండ్రి అలా, కొడుకు ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

