Viral Video : ఒంటరి సింహంపై హైనాల మంద దాడి..! అందుకే ఆపదలో ఆదుకునే నేస్తం ఉండాలంటారు..
Viral Video : అడవికి రాజు సింహం. దాని ముందు ఏ జంతువు నిలబడలేదు. శత్రువు దాడిని తిప్పి కొట్టగల సమర్థుడు సింహరాజు. అయితే ఎంతటి బలవంతుడైనా సరే విధికి తలవంచక తప్పదు. సరిగ్గా అలాంటి

Viral Video : అడవికి రాజు సింహం. దాని ముందు ఏ జంతువు నిలబడలేదు. శత్రువు దాడిని తిప్పి కొట్టగల సమర్థుడు సింహరాజు. అయితే ఎంతటి బలవంతుడైనా సరే విధికి తలవంచక తప్పదు. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ సింహానికి ఎదురైంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ సింహానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ హైనాల మందా సింహంపై దాడి చేస్తుంది. అప్పుడు సింహం ఎలా తప్పించుకుందో చూద్దాం.
వీడియోలో బలహీనమైన ఓ సింహాన్ని 20 హైనాలు చుట్టుముట్టినట్లు చూడవచ్చు. అవి సింహాన్ని ఎలాగైనా తమకి ఆహారంగా చేసుకోవాలని అన్ని కలిసి పథకం వేసాయి. ఆ పద్దతిలోనే దాడి ప్రారంభించాయి. ఈ పరిస్థితిలో ఆ సింహం వాటితో తీవ్రంగా పోరాడుతుంటుంది. ఒక హైనా ముందు దాడి చేస్తే మరొక హైనా వెనకాల దాడి చేస్తుంటుంది. సింహం అయినప్పటికీ ధైర్యం కోల్పోదు. హైనాలు కూడా మైదానాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడవు.
ఇంతలో మరొక సింహం దూరం నుంచి పరిస్థితిని గమనిస్తుంది. తోటి సింహానికి సాయం చేయడానికి వేగంగా అక్కడికి చేరుకుంటుంది. హైనాల మందపై దూకుతుంది. ఇంతలో బాధిత సింహం నేస్తం రావడాన్ని చూసి రెచ్చిపోతుంది. కోపంతో మునుపటి కంటే వేగంగా హైనాలతో పోరాటం చేస్తుంది. దీంతో ఆ సింహాన్ని ఏం చేయలేమని భావించిన హైనాల గుంపు మైదానాన్ని విడిచి వెళ్లిపోతాయి. సింహాలు తమ ప్రాణాలను కాపాడుకుంటాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు జీవితంలో అవసరమని ఈ వీడియో ద్వారా తెలిసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సింహం తన సోదరుడిని కాపాడిందని ఒకరు కామెంట్ చేశారు. అయితే జంతువులకు కూడా మనుషులలాగే భావోద్వేగాలు ఉంటాయని ఈ వీడియో రుజువు చేస్తోంది. వైల్డ్‌లైఫ్_0.2 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 27 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram