Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఇదెక్కడి కథరో.. ఫొటోలు తీద్దామనుకుంటే పరిగెత్తించింది.. జిరాఫీ దెబ్బకు టూరిస్టులు విలవిల..

దూరపు కొండలు నునుపు.. అనే సామెత అడవుల విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారుతుంది. అదే..

Trending Video: ఇదెక్కడి కథరో.. ఫొటోలు తీద్దామనుకుంటే పరిగెత్తించింది.. జిరాఫీ దెబ్బకు టూరిస్టులు విలవిల..
Giraffee Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 30, 2023 | 9:56 PM

దూరపు కొండలు నునుపు.. అనే సామెత అడవుల విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారుతుంది. అదే.. దగ్గరకెళ్తే.. అక్కడ నివాసముంటే.. ప్రతి క్షణం భయం భయంగా గడపాల్సిందే. ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందోననే గుబులుతో బతకాల్సిందే. అందుకే అడవికి వెళ్లాలనుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. జంతువులను చూడాలనుకునేవారు జూ పార్క్ లకు వెళ్తుంటారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రం జంగిల్ సఫారీ చేస్తుంటారు. జీపుపై అడవిలో సవారీ చేస్తూ.. అడవి జంతువులను చూస్తూ ఆనందిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు సీన్ రివర్స్ అవుతుంటుంది. తాము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకో సీన్ జరుగుతుంది. ఇలా సందర్శకులపై అడవి జంతువులు అరుదుగా దాడి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మహిళా ప్రయాణికురాలు ఓపెన్ జీప్‌లో అడవిలో రైడ్ చేసుకుంటూ అక్కడ ఉన్న జిరాఫీని ఫోటోలు తీయడాన్ని చూడవచ్చు. అయితే.. ఆ టూరిస్టర్ అలా ఫొటోలు తీయడం జిరాఫీకి బహుశా నచ్చలేదేమో. కోపంతో ఊగిపోయింది. వాహనం వెనుక పరుగెత్తడం స్టార్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఆమె పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిరాఫీ మహిళపై దాడి చేస్తుందేమో అనిపించింది. అయితే ఆ తర్వాత డ్రైవర్ వాహనం వేగాన్ని పెంచి జంతువుల దాడి నుంచి అందరినీ కాపాడాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Waow Africa (@waowafrica)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. వీడియోకు యాంగ్రీ జిరాఫీ అనే క్యాప్షన్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన వీడియోకి దాదాపు 10,000 లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..