Viral Video: వారెవ్వా వాటే చెప్పులు..! వీటితో సింపుల్‌గా స్తంభం ఎక్కొచ్చు..
Viral Video: గ్రామీణులు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపించాడు ఈ వ్యక్తి. పెద్ద పెద్ద వారికే సాధ్యం కాని పనిని ఇతడు సులువుగా చేసి చూపించాడు.
Viral Video: గ్రామీణులు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపించాడు ఈ వ్యక్తి. పెద్ద పెద్ద వారికే సాధ్యం కాని పనిని ఇతడు సులువుగా చేసి చూపించాడు. కచ్చితంగా ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇలాంటి వారు గ్రామాల్లో చాలామంది ఉంటారు. కానీ వెలుగులోకి రారు. తాజాగా కరెంట్ పోల్ ఎక్కడానికి ఇతడు తయారు చేసిన చెప్పులను చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ చెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి రబ్బరు చెప్పులకు ప్రత్యేక ఇనుప కడ్డీలను అమర్చాడు. అవి ఊడిపోకుండా గట్టి ఏర్పాట్లు చేశాడు. తర్వాత వాటితో సులభంగా స్తంభం ఎక్కాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రోడ్డుపై నడిచిన విధంగా స్తంభం ఎక్కడం మనం వీడియోలో చూడవచ్చు. ఇతడి తెలివిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు వారెవ్వా ఏం చెప్పులు అంటూ అభినందిస్తున్నారు.
ఈ వీడియోను Twitterలో @DoctorAjayita అనే వినియోగదారు షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 50 వేలకు పైగా చూశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ జుగాడ్‌ని సోషల్ మీడియాలో బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి టెక్నిక్‌లను ఎలక్ట్రీషియన్లు ఎక్కువగా అనుసరిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
Ye technology India se bahar nahi jani chahiye, dosto! pic.twitter.com/WitwttddmM
— Dr. Ajayita (@DoctorAjayita) October 8, 2021