AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: హైదరాబాద్‌ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు మూడు గంటలు ఏకధాటిగా కుండపోత

Hyderabad Rains: హైదరాబాద్‌ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..
Hyderabad Rains
uppula Raju
| Edited By: |

Updated on: Oct 09, 2021 | 5:32 PM

Share

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు మూడు గంటలు ఏకధాటిగా కుండపోత కురిపించింది. దీంతో రాజధాని వీధులు జలాశయాలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పలు రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది.

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మణికొండ, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా,రామ్‌నగర్‌, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్‌, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌, అనాజ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. వర్షానికి తడిసి వాహనాలు మొరాయించడంతో మరికొందరు వాటిని తోసుకుంటూ వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్‌ హోల్‌ ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు.

చింతల కుంట వద్ద గల్లంతైన వ్యక్తి సురక్షితం.. చంపాపేటలో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌ పడిపోయినట్లు సమాచారం. బైక్‌పై వస్తూ నాలా దాటుతుండగా కింద పడిపోగా స్థానికులు రక్షించారు. ఇదిలా ఉంటే చింతల కుంట వద్ద నాలాలో కర్మన్‌ఘాట్‌కు చెందిన జగదీశ్‌ పడిపోగా గమనించిన స్థానికులు కాపాడారు. ప్రస్తుతం జగదీశ్‌ సురక్షితంగా ఉన్నట్టు అతని సోదరుడు తెలిపారు. లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు, కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్‌ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read Also: SRH vs MI: దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్‌.. సన్‌ రైజర్స్‌పై ఘన విజయం..

IPL 2021, RCB vs DC Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న భరత్, మ్యాక్స్‌వెల్

CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!