Hair Style: వార్నీ ఇదేం హెయిర్‌స్టైల్‌ తల్లి.. కోడి పుంజు నెత్తినెక్కిందా ఏంటీ.? కోసి కూరొండేస్తారు జాగ్రత్త..!

ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి ఒక ఖాళీ మైదన ప్రదేశంలో నిలబడి పాటకు లిప్ సింక్‌ చేస్తూ వీడియోను రికార్డ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ విచిత్ర హెయిర్‌ స్టైల్‌కు ఫాన్సీ పేరు పెట్టారు. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోకు ఈ లాఫింగ్ ఎమోజీని షేర్ చేశారు.

Hair Style: వార్నీ ఇదేం హెయిర్‌స్టైల్‌ తల్లి.. కోడి పుంజు నెత్తినెక్కిందా ఏంటీ.? కోసి కూరొండేస్తారు జాగ్రత్త..!
Hair Style
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2024 | 10:52 AM

సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఒకరు డ్యాన్స్ చేస్తూ, ఒక్కోసారి పాటలు పాడుతూ కనిపిస్తారు. ఒక్కోసారి కొందరు మెట్రోలో పోట్లాడుకుంటుంటే మరికొందరు జూదం ఆడుతూ కనిపిస్తారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో చీరల గురించి చర్చిస్తారు. కొన్నిసార్లు హెయిర్ స్టైల్ గురించి చర్చిస్తారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ అమ్మాయి హెయిర్ స్టైల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియో చూసిన తర్వాత ఇదేం హెయిర్‌స్టైల్ బాబోయ్‌ అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి ఒక ఖాళీ మైదన ప్రదేశంలో నిలబడి పాటకు లిప్ సింక్‌ చేస్తూ వీడియోను రికార్డ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఆమె తన జుట్టును కోడి పుంజు ఆకృతిలో తయారు చేసింది. దూరం నుండి చూస్తే ఆమె తలపై కోడి పుంజు కూర్చుని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ తరహా హెయిర్ స్టైల్ ను మీరు మొదటిసారి చూసి ఉంటారు. ఈ ప్రత్యేకమైన హెయిర్‌ స్టైల్‌ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇదేం స్టైల్‌రా సామీ అంటూ ఆశ్చర్యకర కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagram ఖాతా @fewsecl8r ద్వారా షేర్‌ చేయబడింది. ఈ వీడియో శీర్షిక ఇలా రాసి ఉంది. “ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హెయిర్ స్టైల్ ఇది. దీనికి ఏం పేరు పెడతారు?” చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ఒక వినియోగదారు స్పందిస్తూ..కోడిపుంజు హెయిర్ స్టైల్ అని రాయగా, మరొకరు “రూస్టర్ కట్” అంటున్నారు. “రూస్టర్ స్టైల్” అని ఇంకొకరు రాశారు.“కాక్‌టెయిల్ హెయిర్ స్టైల్‌ అని మరొకరు రాశారు. చాలా మంది వినియోగదారులు ఈ విచిత్ర హెయిర్‌ స్టైల్‌కు ఫాన్సీ పేరు పెట్టారు. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోకు ఈ లాఫింగ్ ఎమోజీని షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..