Viral Video: ఈ ఒక్క సీన్ చెబుతుంది.. ప్రతీ తండ్రికి తన కూతురు ఎందుకంత ప్రాణమో..!
Viral Video: మనం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ప్రాంక్‌లు, ఫన్నీ స్కిట్స్, వైల్డ్ లైఫ్ కు సంబంధించిన చాలా వీడియోలు..
Viral Video: మనం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ప్రాంక్‌లు, ఫన్నీ స్కిట్స్, వైల్డ్ లైఫ్ కు సంబంధించిన చాలా వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని సంతోషాన్నిస్తాయి. ఇంకొన్ని కవ్విస్తాయి. కానీ.. తాజాగా ట్రెండ్ అవుతున్న వీడియో మాత్రం.. మనసును హత్తుకుంటోంది. అసలు ఒక ఇంట్లో కూతురు ఉండటం ఎంత ముఖ్యమో ఆ వీడియో తెలియజేస్తుంది. ముఖ్యంగా డాడ్స్ క్వీన్ అని అమ్మాయిలను ఎందుకంటారో అర్థం అవుతుంది. నాన్నలు తమ కూతుళ్లను గారాలపట్టిగా ఎందుకు భావిస్తారో ఇట్టే తెలిసిపోతుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి, చిన్నారి కూతురుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తుంది. ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తన చిన్నారి కూతురుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ట్రైన్‌లో సీట్లు లేకపోవడంతో.. ఫుట్‌పాత్‌పై కూర్చున్నాడు. తన పక్కనే ఆ చిన్ని పాపను కూర్చొపెట్టాడు. అయితే, తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ ఎంతైనా స్పెషలే కదా? ఆ సీన్ ఇక్కడ ఆవిష్కృతం అయ్యింది. ఆ తండ్రి ఏదో ఆలోచిస్తూ ట్రైన్ బయటకు చూస్తున్నాడు. తన కూతురుకు చిప్స్ ప్యాకెట్ కోనివ్వగా.. అవి తింటూ ఉంది ఆ చిన్నారి. ఇంతలో తన తండ్రి ధీర్ఘ ఆలోచనలో ఉండగా.. ఆ చిన్నారి తన చేతిలోని చిప్స్ తీసి.. తన తండ్రికి తనిపించింది. ఆ సమయంలో ఆ తండ్రి కళ్లలో ఒక రకమైన సంతోష భావన కలిగింది. అది అతని కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. అయితే, ఈ హార్ట్ టచ్చింగ్ సీన్‌ను ట్రైన్‌లో కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.
ఈ బ్యూటీఫుల్ వీడియోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. భావోద్వేగంతో కూడిన క్యాప్షన్స్ పెడుతున్నారు నెటిజన్లు. ‘అందుకే ప్రతి ఇంట్లో కూతురు ఉండాలని అంటారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రతీ ఒక్కరికి వారి కష్టాలతో పోరాడే శక్తిని దేవుడు ఇస్తాడూ.. వారి పరిస్థితి ఉదహరిస్తూ మరొకరు కామెంట్ పెట్టారు. మొత్తానికి ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..