Viral Video: అరెరే.. హైఫై చెప్పుకోవడానికి వచ్చిన తిప్పలు.. చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

పోటీలో పాల్గొనే వారు ఒకరినొకరు పలకరించుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం సాధారణమే. అయితే పిల్లల

Viral Video: అరెరే.. హైఫై చెప్పుకోవడానికి వచ్చిన తిప్పలు.. చూస్తే పడి పడి నవ్వాల్సిందే..
Viral Video 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2022 | 9:54 PM

చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించడం సాధారణమే. వారిలోని సామర్థ్యాలను, అభిరుచులను బయటకు తీసుకువచ్చేందుకు వీటిని నిర్వహిస్తుంటారు. అయితే బైక్ రేస్, కార్ రేస్ వంటి వాటిని మాత్రం నిపుణుల పర్వవేక్షణలో ఏర్పాటు చేస్తారు. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదకర ఆటలను నిర్వహించకపోవచ్చు కూడా. అయితే వారిలో క్రీడా స్ఫూర్తిని కలిగించి స్నేహపూర్వక వాతావరణం కోసం హైఫై ఇచ్చుకోవాలని క్రీడా నిపుణులు సూచిస్తారు. ఇదే పద్ధతి ఇప్పుడు ఆటలాడే సమయంలో సంప్రదాయంగా మారింది. ఆటలో పాల్గొనే ముందు, హైపై ఇచ్చుకోవడం ద్వారా వారి మధ్య మనమంతా ఒకటేననే భావన కలుగుతుంది. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు బైక్ రేసులో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా.. హైపై ఇచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే..ఎంత సేపు వారు అలా చేస్తున్నప్పటికీ వారి చేతులు కలవకపోవడం, అందుకోసం వారు పడే తంటా చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే.

పోటీలో పాల్గొనే వారు ఒకరినొకరు పలకరించుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం సాధారణమే. అయితే పిల్లల కోసం బైక్ రైస్ ఏర్పాటు చేశారు. ఈ రేసులో పాల్గొనే చిన్నారులిద్దరూ హైఫై చెప్పుకోవడం కోసం పడే కష్టాలు చూస్తే పడీపడీ నవ్వాల్సిందే. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ అయింది. మిడిల్‌టన్‌కు చెందిన మూడేళ్ల రేసర్‌కు ఈ వీడియో అంకితం చేశారు. ఇది చిన్నపిల్లలకు ఇచ్చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.