Viral News: ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే.!

Viral News: సాధారణంగా ఒక చెట్టుకు ఒక రకమైన పండు మాత్రం కాస్తుంది. కాని మీరెప్పుడైనా ఓ చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చూశారా.?..

Viral News: ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే.!
Fruits
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:10 PM

సాధారణంగా ఒక చెట్టుకు ఒక రకమైన పండు మాత్రం కాస్తుంది. కాని మీరెప్పుడైనా ఓ చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చూశారా.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నమ్మడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా.. నిజమండీ బాబు.! ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాసాయి.

ఈ ప్రత్యేకమైన చెట్టును ‘ట్రీ ఆఫ్ 40’ అని అంటారు. దీనికి ప్లం, పైన్, నేరేడు పండు, చెర్రీ, నెక్టరైన్,పీచ్, మామిడి, ద్రాక్ష వంటి అనేక పండ్లు కాస్తాయి. కొంతమంది ప్రజలు దీన్ని అసాధ్యమని పిలిచినా.. అమెరికా నిపుణులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

ఒక చెట్టు ధర రూ. 19 మిలియన్లు..

ఈ చెట్టును అమెరికాలోని సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న వాన్ ఐకెన్ సృష్టించారు. అంటు కట్టడంలో వినూత్న పద్దతులను పాటించడం ద్వారా ఇలా ఒకే చెట్టుకు నలబై రకాల పండ్లను కాసేలా చేశామని ఆయన తెలిపాడు. ఈ చెట్టును పెంచడానికి ప్రొఫెసర్‌కు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది.

‘ట్రీ ఆఫ్ 40’ అని పిలవబడే ఈ చెట్టు ధర సుమారు రూ. 19 లక్షలు. ఆయన ఒకానొక సందర్భంలో ఒక తోటను సందర్శించాడట. అందులో సుమారు 200 రకాల పండ్లు పండుతుండటం చూశారట. వాటిని వృధాగా వదిలేస్తున్నారని తెలుసుకుని.. ఆ తోటను కౌలుకు తీసుకుని ప్రొఫెసర్ ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ఐడియాను విన్న నెటిజన్లు.. ఆయన ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!