130 కిలోల నుంచి 5 నెలల్లో 32 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైట్, వర్కవుట్ సీక్రెట్స్ ఇవే!
పెరిగిన బరువును తగ్గించుకోవడం నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. తీవ్రమైన లావుతో బాధపడుతూ, బరువు తగ్గడం అసాధ్యమని భావించే వారికి నవు అనే మహిళ ప్రయత్నం ఒక గొప్ప ఆశాకిరణంగా నిలుస్తోంది. 130 కిలోల బరువుతో ఉన్న ఆమె కేవలం 5 నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 32 కిలోలు తగ్గి తన ఫిట్‌నెస్ ప్రయాణంతో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

130 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు పడిన నవు అనే మహిళ, కేవలం 5 నెలల్లోనే 32 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రమశిక్షణ, సరైన ప్రణాళికతో ఇది సాధ్యమైందని ఆమె తెలిపింది. బరువు తగ్గడానికి తాను ఎలాంటి పద్ధతులు పాటించింది. దీనికి తోడు స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కవుట్లు చేస్తూ తన శరీర రూపాంతరం సాధించానని వెల్లడించింది. పట్టుదల ఉంటే ఎవరైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆమె స్పూర్తిని నింపుతోంది.
తన ఫిట్‌నెస్ ప్రయాణంలో ఎలాంటి తీవ్రమైన పద్ధతులు పాటించకుండా, అత్యంత సమర్థవంతమైన మార్గాలను ఎంచుకున్నట్లు నవు తెలిపింది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ తాను తీసుకునే ఆహారంలోని క్యాలరీలను ట్రాక్ చేయడం ప్రారంభించింది. క్యాలరీ డెఫిసిట్ శరీరానికి అవసరమైన క్యాలరీల కంటే తక్కువ తీసుకోవడం విధానాన్ని కచ్చితంగా పాటించింది.
ఆహారంలో ప్రొటీన్ శాతాన్ని పెంచడం ద్వారా కండరాల క్షీణత లేకుండా చూసుకుంది. ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అనవసరమైన ఆకలి నియంత్రణలోకి వచ్చింది. కేవలం జిమ్‌కే పరిమితం కాకుండా, ప్రతిరోజూ నిర్ణీత సంఖ్యలో అడుగులు నడవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది. ఇది రోజంతా క్యాలరీలు ఖర్చయ్యేలా చేసింది.
కేవలం కార్డియో వ్యాయామాలపై ఆధారపడకుండా, వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఆమె శరీరానికి సరైన షేప్ ఇవ్వడానికి, మెటబాలిజం వేగవంతం చేయడానికి ఎంతగానో తోడ్పడింది. ఈ సందర్భంగా నవు మాట్లాడుతూ.. 5 నెలల క్రితం 130 కిలోల బరువు ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో మార్పు సాధిస్తానని అసలు ఊహించలేదు. సరైన క్రమశిక్షణ, ప్రణాళిక ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆనందం వ్యక్తం చేసింది.
View this post on Instagram
త్వరగా బరువు తగ్గాలని మార్కెట్లో దొరికే సప్లిమెంట్లు లేదా పస్తులుండే డైటింగ్ పద్ధతులు అనుసరించకుండా, స్థిరమైన జీవనశైలి మార్పుల ద్వారా మాత్రమే శాశ్వత ఫిట్‌నెస్ సాధ్యమని ఈమె ప్రయాణం నిరూపిస్తోంది.




