AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WOW: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 1.5 ఏళ్ల నిఖిల్! ఏం చేశాడో తెలుసా?

చిన్నారులు కొన్నిసారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. వాళ్లు చేసే చిన్న చిన్న పనులు కూడా అందరి మనసుల్ని గెలుస్తాయి. పూణేలో నివసించే 1.5 ఏళ్ల చిన్నారి నీల్ నిక్కిల్ భలేరావ్ కూడా అలాంటి ఒక అద్భుతం. ఇటీవల ఈ చిన్నోడు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ..

WOW: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 1.5 ఏళ్ల నిఖిల్! ఏం చేశాడో తెలుసా?
Neil
Nikhil
|

Updated on: Nov 30, 2025 | 3:53 PM

Share

చిన్నారులు కొన్నిసారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. వాళ్లు చేసే చిన్న చిన్న పనులు కూడా అందరి మనసుల్ని గెలుస్తాయి. పూణేలో నివసించే 1.5 ఏళ్ల చిన్నారి నీల్ నిక్కిల్ భలేరావ్ కూడా అలాంటి ఒక అద్భుతం. ఇటీవల ఈ చిన్నోడు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు! 2 నిమిషాల 53 సెకన్లలో 45 గ్లోబల్ కార్ బ్రాండ్స్‌ను గుర్తించి, చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన చిన్నారిగా రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ రికార్డు కేవలం గుర్తింపు మాత్రమే కాదు.. చిన్నారి మెమరీ పవర్, ప్యాటర్న్ రికగ్నిషన్ స్కిల్స్‌కు ఒక గ్రేట్ టెస్టిమోనియల్.

నీల్ జర్నీ ఎలా మొదలైంది?

కేవలం 6 నెలల వయసులోనే నీల్​ కార్ ఇమేజెస్ చూస్తూ వాటిపై ఆసక్తి చూపించాడట. తల్లి ప్రేరణా భలేరావ్, తండ్రి నిఖిల్ భలేరావ్ ఆ ఆసక్తిని గమనించి, డైలీ ట్రైనింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఫ్యామిలీ కార్ బ్రాండ్స్‌తో ప్రాక్టీస్ చేసి, క్రమంగా మెర్సిడెస్, ఫెరారీ, టయోటా, బియమ్వ్, లాంబోర్గినీ, జాగ్వార్, పోర్షే, ఆడీ, వోల్వో, టెస్లా… ఇలా 45 బ్రాండ్స్ వరకు పెంచారు. ‘నీల్ కార్ లోగోలు చూస్తుంటే డాన్స్ చేస్తాడు, పేరు చెప్పమంటే జంప్ చేస్తాడు!’ అంటూ తల్లి ప్రేరణా గర్వంగా చెప్పుకుంటుంది. తండ్రి నిఖిల్, ఒక ఐటీ ఇంజనీర్, ఫ్లాష్‌కార్డ్స్, వీడియోలు, రియల్ కార్ స్పాటింగ్‌తో ట్రైనింగ్ డిజైన్ చేశాడు. రోజూ 30-45 నిమిషాలు మాత్రమే ట్రైనింగ్​ ఇచ్చేవారట.. అది కూడా సరదాగా!

View this post on Instagram

A post shared by PUNE PULSE (@punepulse)

రికార్డ్ ఈవెంట్ నవంబర్ 28, 2025న పూణేలో జరిగింది. ఒక చిన్న హాల్‌లో, జడ్జీల ముందు కూర్చుని, స్క్రీన్‌పై ఒక్కొక్క లోగో కనిపించినప్పుడు నీల్ మెర్సిడెస్!, ఫెరారీ! అంటూ గట్టిగా చెప్పాడు. 45 బ్రాండ్స్.. అందులో 30 గ్లోబల్, 15 ఇండియన్ మార్కెట్ బ్రాండ్స్! టైమర్ స్టాప్ అయ్యేసరికి, అందరూ క్లాప్ చేస్తూ ఆశ్చర్యపోయారు. ‘ఇది కేవలం మెమరీ కాదు, చిన్నారి ఇంటెలిజెన్స్‌కు ప్రూఫ్’ అంటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు సర్టిఫికేట్ అందజేశారు.

ఇది అద్భుతం మాత్రమే కాదు.. పేరెంట్స్‌కి ఒక మెసేజ్! చిన్నారుల్లో టాలెంట్ గుర్తించి, ప్రొత్సహించడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. మహారాష్ట్రకు, ఇండియాకు ఈ చిన్న రికార్డు గర్వకారణం. నీల్ ఫ్యామిలీ ఇప్పుడు అతడిని ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేస్తోంది. బుక్స్, పజిల్స్, ఇంకా మరిన్ని రికార్డులు సృష్టించేందుకు నీల్ సిద్ధమవుతున్నాడు!