Viral Vide: హైవేపై రిలాక్స్ మోడ్‌లో పెద్ద పులి.. గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్! ఆ తర్వాత సీన్ ఇదే
నిత్యం వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై ఓ అనుకోని అతిథిని చూసి జనాలు గజగజలాడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ హైవేపై ఓ పులి తిష్ట వేసింది. అంతే పాపం.. భయంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఎటూ వెళ్లలేక సతమతమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు హైవేపై వాహనాలు నిలిచిపోయాయి...

నిత్యం వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై ఓ అనుకోని అతిథిని చూసి జనాలు గజగజలాడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ హైవేపై ఓ పులి తిష్ట వేసింది. అంతే పాపం.. భయంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఎటూ వెళ్లలేక సతమతమయ్యారు. కొన్ని గంటల పాటు హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్-మొహర్లి రోడ్డులో చోటు చేసుకుంది. హైవే మధ్యలో పులి కూర్చుని ఉండటంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. దీనితో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో.. రోడ్డు మధ్యలో పెద్ద పుటి కూర్చుని రిలాక్స్ అవడం వీడియోలో చూడొచ్చు. దీంతో రెండు వైపులా వాహనాలు క్యూలో నిలిచిపోయాయి. అయితే పులి మాత్రం రోడ్డుపై నిర్భయంగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. దీంతో వాహనదారులు సురక్షితమైన దూరం పాటిస్తూ అల్లంత దూరంలోనే వాహనాల్లో బిక్కుబిక్కు మంటూ గడిపారు. రోడ్డు మధ్యలో పెద్ద పిల్లి కూర్చోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డు పొడవున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజల భద్రతకు తగిన ఏర్పాట్లు చేశారు.
#WATCH | A tiger stopped the road on the Chandrapur-Moharli route in Tadoba of Chandrapur district, Maharashtra. Traffic halted for hours for the tiger to finish his snooze. (Video courtesy : X) #Maharashtra #Viralvideos pic.twitter.com/HUwY6ioP96
— Deccan Chronicle (@DeccanChronicle) November 29, 2025
ఇంతలో పులి నింపాదిగా లేచి ప్రశాంతంగా అడవి వైపు నడిచుకుంటూ వెళ్లిపోయింది. రోడ్డ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరగలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సమీపంలో ఉన్న చంద్రపూర్–మొహర్లి ప్రాంతంలో ఇటీవల నెలల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. గత నెలలో అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలపై ఆడ పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం మగ పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇది ఈ ప్రాంతంలో అనేకసార్లు కనిపించిందన్నారు. దీంతో ఈ మార్గంలో రోజువారీ ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




