దిశ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..ఏకంగా హైకోర్టుకు లేఖ

దిశ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..ఏకంగా హైకోర్టుకు లేఖ

దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన మృగాళ్లకు శిక్షను విధించే  క్రమంలో జాప్యం జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చెయ్యల్సిందిగా ఏకంగా హైకోర్టుకే లేఖ రాసింది. అటువంటి ఉన్మాదులకు వెంటనే శిక్షలు వెయ్యకుండా ఈ జాప్యం ఏంటంటూ ప్రభుత్వం లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరుపున హై కోర్ట్‌కు లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో సాయంత్రంలోగా ఫాస్ట్ […]

Ram Naramaneni

| Edited By: Srinu Perla

Dec 04, 2019 | 4:55 PM

దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన మృగాళ్లకు శిక్షను విధించే  క్రమంలో జాప్యం జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చెయ్యల్సిందిగా ఏకంగా హైకోర్టుకే లేఖ రాసింది. అటువంటి ఉన్మాదులకు వెంటనే శిక్షలు వెయ్యకుండా ఈ జాప్యం ఏంటంటూ ప్రభుత్వం లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరుపున హై కోర్ట్‌కు లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో సాయంత్రంలోగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌పై నిర్ణయం తెలుపనుంది హైకోర్టు.

ప్రస్తుతం నిందితులంతా చర్లపల్లి జైల్లో ఉన్నారు. కోర్టు ఇప్పటికే వారికి 10 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఉద్రిక్తతల నేపథ్యంలో…పోలీసులు సీక్రెట్‌గా విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితులు తాగిన మైకంలోనే తప్పు చేశామని, ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియదంటూ ప్రాథమిక విచారణలో తెలిపినట్టు సమాచారం. కానీ దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఆడబిడ్డలకు సేప్టీ ఏదంటూ ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిందితుల్లో ఒక్కడికి కూడా చట్టాలంటే భయం, ఆడపిల్లపై అంత పైశాచికంగా ప్రవర్తిస్తున్నామన్న ఆలోచన లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం. అటువంటి ఉన్మాదులకు ఉరే సరి అంటూ దేశవ్యాప్తంగా మహిళలకు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu