YS Sharmila: గుడ్లు పీకేస్తానన్న హామీ ఏమైంది.. కేసీఆర్ పాలనలో అఘాయిత్యాలు.. వైఎస్.షర్మిల..
వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి అత్మహత్య దురదృష్టకరమని అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుపై..
వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి అత్మహత్య దురదృష్టకరమని అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుపై విచారణ జరిపి, దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరమన్న షర్మిల… వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవని చెప్పారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని ఫైర్ అయ్యారు.
అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న కేసీఆర్.. ఇంతవరకు గడీ దాటింది లేదు. నిర్లక్ష్యం వల్లే అల్లరిమూకలు రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రీతిని వేధించిన వ్యక్తితో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొని, అమ్మాయిలకు రక్షణ కల్పించాలి.
– ట్విట్టర్ లో వైఎస్.షర్మిల
మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరం. వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవి. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో KCR సర్కార్ విఫలం అయింది. అమ్మాయిల వంక 1/2
— YS Sharmila (@realyssharmila) February 26, 2023
నిమ్స్‌లో అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..