YS Sharmila: మొన్న ట్రాక్టర్.. ఇవాళ ఆటో నడిపిన షర్మిల.. ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రజా ప్రస్థానం

YS Sharmila: ఇప్పటివరకు జరిగిన పాదయాత్రంతా ఒక లెక్క, ఖమ్మం జిల్లాలో జరుగుతోన్న పాదయాత్ర మరో లెక్క అన్నట్లుగా సాగుతోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే..

YS Sharmila: మొన్న ట్రాక్టర్.. ఇవాళ ఆటో నడిపిన షర్మిల.. ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రజా ప్రస్థానం
Ys Sharmila
Follow us
Sanjay Kasula

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 16, 2022 | 8:58 PM

YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర …ఖమ్మం జిల్లాలో మంచి జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన పాదయాత్రంతా ఒక లెక్క, ఖమ్మం జిల్లాలో జరుగుతోన్న పాదయాత్ర మరో లెక్క అన్నట్లుగా సాగుతోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఖమ్మం జిల్లాలో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రకు జనం నుంచి స్పందన లభిస్తోంది. షర్మిల యాత్ర గురువారంతో 96వ రోజుకు చేరింది. ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిలకు.. YSRTP లీడర్లు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం, ఆటో నడుపుతూ కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు వైఎస్‌ షర్మిల. ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జెడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగింది. ఈ క్రమంలోనే ఖమ్మం టౌన్ ముస్తఫానగర్‌కు వైఎస్ షర్మిల చేరుకోగాా.. అక్కడ ఓ అభిమాని కోరిక మేరకు ఆటో నడిపారు. కేవలం ఐదేళ్లలోనే ప్రజలకు నూటికి నూటిశాతం సంక్షేమ పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అన్నారు షర్మిల. వైఎస్సార్‌తో ఏ ముఖ్యమంత్రీ సాటి రారని అన్నారు.

వీడియోను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..