Allu Arjun: మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు షరతులను విధిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు మరోసారి చిక్కడపల్లి పీఎస్ కు వెళ్లారు బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టాలన్న నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పీఎస్‌కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో పీఎస్ బయట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లో తన నివాసం నుంచి వెళ్లి సంతకం పెట్టి పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. ఇప్పటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌లో సంతకం పెట్టాలని సూచించింది.
మరోవైపు అల్లు అర్జున్‌కి రాంగోపాల్‌పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రావొద్దంటూ సూచించారు పోలీసులు. రోగుల వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే బన్నీని రావొద్దని చెప్తూ నోటీసులు జారీ చేశారు. అయినా సరే అల్లు అర్జున్ రావాలి అనుకుంటే ఆస్పత్రివర్గాలతో సమన్వయం చేసుకోవాలని.. అది కూడా పోలీసులకు ముందే చెప్తే బన్నీ వచ్చి, వెళ్లే టైమ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారని తెలిపారు. పరామర్శకు ఎప్పుడు వస్తున్నారో రహస్యంగా ఉంచాలని.. దానివల్ల అల్లు అర్జున్ వస్తున్నాడని ఆస్పత్రి దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాకుండా చూసేందుకు వీలుంటుంది పేర్కొన్నారు.
ఆస్పత్రిలో రోగులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు.. ఒకవేళ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వస్తే ఊహించని ఘటనలు జరగకుండా చూసేందుకు బన్నీ సహకారం కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ‘మీనుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల పబ్లిక్‌కి ఇబ్బందులు తలెత్తి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే దానికి మీదే బాధ్యత’ అంటూ రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్ పేరుతో నోటీసులు ఇచ్చారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.