AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తన భర్తకు మరో మహిళతో దగ్గరుండి పెళ్లి చేసిన భార్య.. రీజన్ ఏంటో తెల్సా..?

తన భర్త వేరే మహిళకు దగ్గరైతే ఏ భార్యా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేయించింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: తన భర్తకు మరో మహిళతో దగ్గరుండి పెళ్లి చేసిన భార్య.. రీజన్ ఏంటో తెల్సా..?
Strange Marriage
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 29, 2024 | 10:28 AM

Share

ఇదో విచిత్ర సంఘటన.. రీల్ స్టోరీ కాదు.. రియల్ సీన్.. తన భర్తను ఇష్టపడిన ఓ మానసిక వికలాంగురాలికి భార్యే దగ్గరుండి తన భర్తతో వివాహం జరిపించిన విచిత్ర సంఘటన ఇది.. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ పెళ్ళ వేడుక ప్రతి ఒక్కరినీ నివ్వెరపోయేలా చేసింది.. ఆ పెళ్ళికి వచ్చిన అతిధులంతా మొదట ఆశ్చర్య పోయారు.. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని ఆశీర్వదించారు.. పెద్దమనసు చేసుకున్న భార్య త్యాగాన్ని అభినందించారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో జరిగింది. చిన్న గూడూరు గ్రామానికి చెందిన సురేష్ – సరిత దంపతులకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారి జీవనం సంతోషంగా సాగుతోంది. అయితేూ మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ – వీరాస్వామి దంపతుల చిన్నకూతురు సంధ్య సురేష్‌ను తనకు ఉహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తుంది.. ఈ విషయం సురేష్ భార్య సరితకి తెలిసింది.

ఆ మానసిక వికలంగురాలి మనసు అర్థం చేసుకున్న సరిత పెద్దమనసు చేసుకుంది.. తన భర్తకు సంధ్యతో మళ్ళీ పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంది. అంతేనా.. నా భర్తకు మళ్లీ పెళ్లి… మీరంతా రావాలి మళ్ళీ అని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. అతిధులందరి సమక్షంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు నడుమ తన భర్తకి రెండో పెళ్లి అట్టహాసంగా నిర్వహించింది. ఈ వివాహ వేడుకను సురేష్ మొదటి భార్య సరిత.. అంతా తానై జరిపించడం విశేషం. ఈ విచిత్ర వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Strange Marriage

తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడుతున్న విషయం తెలిసిన వెంటనే పవిత్రబంధాన్ని వేరొకరికి పంచి ఇచ్చిన సరితది గొప్ప మనసని కొందరు ప్రశంసించారు. వధువు సంధ్య తన పని తాను కూడా చేసుకోలేని చిన్న పిల్లల మనస్తత్వం కలదని.. తనను పసి పిల్లాలానే చూసుకోవాలని సరిత.. తన భర్త సురేష్‌ను కోరింది. ఈ వివాహం ప్రజంట్ నెట్టింట ట్రెండింగ్ టాపిక్ అయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..