Hyderabad: దారుణం.. బ్రేకప్ చెప్పినా వదలని నీచుడు.. చివరకు కూరగాయలు కోసే కత్తితో వెళ్లి..

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు.. అయితే.. ఆమెను చంపింది మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో చోటుచేసుకుంది..

Hyderabad: దారుణం.. బ్రేకప్ చెప్పినా వదలని నీచుడు.. చివరకు కూరగాయలు కోసే కత్తితో వెళ్లి..
Attack (representative image)
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2024 | 11:30 AM

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు.. అయితే.. ఆమెను చంపింది మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో చోటుచేసుకుంది.. అర్ధరాత్రి ప్రియురాలిపై కత్తితో దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు.. ఈ క్రమంలో.. అడ్డుకోబోయిన మరో ముగ్గురు యువతులకు కూడా గాయాలయ్యాయి.. ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పింది.. అయినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడిన యువకుడు ఆమెను చంపి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక బీదర్​కు చెందిన రాకేశ్​ అనే వ్యక్తి మాదాపూర్​లోని ఓ ప్రైవేటు హాస్టల్​లో ఉంటున్నాడు. అతనికి నల్లగండ్లలో బ్యూటీషియన్​గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ వెస్ట్​కు చెందిన దీపన తమాంగ్ అలియాస్ గ్రీష్మ (25)  అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. దీపన తమాంగ్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి గోపన్​పల్లి తండాలో నివాసం ఉంటుంది. అయితే.. వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు ఏర్పడ్డాయి.. దీంతో రాకేశ్​​కు దీపన బ్రేకప్​ చెప్పింది. అయినా రాకేశ్.. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంట పడుతూ వేధించేవాడు..

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేశ్.. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు.. యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాకేశ్ కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు.. ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి దీపన ముగ్గురు స్నేహితులు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దీపన అక్కడికక్కడే మృతిచెందగా.. దాడిని అడ్డుకున్న ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చివరకు ఆత్మహత్యాయత్నం..

అయితే.. యువతిపై దాడి అనంతరం రాకేశ్‌ కనకమామిడి వద్ద కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో గాయపడిన రాకేశ్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..