Hyderabad: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే చంపేసింది.. చివరికి సాంయత్రం వేళ ఆ చెరువు గట్టున..
Hyderabad News: కట్టమైసమ్మ ఆలయం సమీపంలోని బంధం చెరువు కట్టపై మహిళా మృతదేహాన్ని గుర్తించారు అక్కడి స్థానికులు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా మృతురాలు రేణుక అలియాస్ ధరణిగా గుర్తించారు. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేష్ తో రేణుకకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అనంతరం కుటుంబ కలహాలతో భర్త..

హైదరాబాద్, ఆగష్టు 03: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలా అయినా తొలగించాలని భావించింది. చివరకు మరొక మహిళతో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కొద్దీ రోజుల క్రితం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆమె.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి, తిరిగి ఇంటికి వచ్చింది. ఆ కాసేపటికే బయటికి వెళ్లగా శవమై తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. భర్తను హత్య చేసిన కేసులో బెయిల్ పై నుండి వచ్చిన అనంతరం భార్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. కట్టమైసమ్మ ఆలయం సమీపంలోని బంధం చెరువు కట్టపై మహిళా మృతదేహాన్ని గుర్తించారు అక్కడి స్థానికులు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా మృతురాలు రేణుక అలియాస్ ధరణిగా గుర్తించారు. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేష్ తో రేణుకకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అనంతరం కుటుంబ కలహాలతో భర్త సురేష్ తో విడిపోయి ఉంటున్న రేణుక దుండిగల్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిబాబాతో సహజీవనం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త సురేష్ భార్య రేణుకను మందలించాడు. దీంతో ఎలా అయినా సురేష్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రేణుక.. ఫిబ్రవరి 6న మరో మహిళతో కలిసి భర్త సురేష్ ను దారుణంగా హత్య చేసింది. ఆ కేసులో జైలుకెళ్ళిన రేణుక ఇటీవల బెయిల్ పై తిరిగి వచ్చింది.
తాజాగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి ఇంటికి వెళ్లిన రేణుక పని మీది తిరిగి బయటికి రాగా రేణుకను బంధం చెరువు కట్టపై హత్య చేశారు. మృతురాలు రేణుకా మృతదేహం పై ఉన్నటువంటి గాయాలను చూసి హత్యగా తేల్చారు పోలీసులు. దీంతో ఆమె మొబైల్ ఫోన్ ను పరిశీలించగా చివరి ఫోన్ కాల్ రేణుక భర్త సురేష్ తమ్ముడు నరేష్ తో మాట్లాడినట్లుగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
