Telangana: భర్త మానసిక స్థితి బాలేదు.. మామ ఏమో కామాంధుడు.. కోడలు ఏం చేసిందంటే.!
ఎవరో పరాయి వాడు కాదు. సొంతింట్లోనే. స్వయానా మామ. ఓ తండ్రి పాత్ర పోషించాల్సిన వాడు. మదమెక్కి విరుచుకుపడుతుంటే ఎన్నాళ్ళని భరిస్తుంది...
నిలువెల్లా మదమెక్కిన జిత్తుల మారి నక్క మామ కీచక పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టింది వనపర్తి జిల్లాలోని ఓ యువతి. స్వయంగా కొడుకునిచ్చిన మామ కొవ్వెక్కి లైంగికంగా వేధిస్తుంటే.. అపర కాళికలా మారింది. తన దేహాంపై చేయివేసిన మామని చావచితకబాదిన ఘటన సర్వత్రా సంచలనాత్మకంగా మారింది.
ఎవరో పరాయి వాడు కాదు. సొంతింట్లోనే. స్వయానా మామ. ఓ తండ్రి పాత్ర పోషించాల్సిన వాడు. మదమెక్కి విరుచుకుపడుతుంటే ఎన్నాళ్ళని భరిస్తుంది. ఒళ్ళు మండిపోయి అపరకాళికలా మారింది. కుమారుడి మానసిక స్థితి సరిగాలేకపోవడంతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆ కిరాచక మామ. ఎంతో కాలంగా కోడలిని చెరబట్టాలని చూసిన కీచకుడికి దేహశుద్ధి చేసి తనలో రగులుతోన్న కోపాగ్నిని చల్లార్చుకుంది. అంతేకాదు. ఇంతకాలంగా అంతేలేని మామ అరాచకాలకు సాక్ష్యాలను కూడా సేకరించింది. తన గదిలోకి వచ్చిన నాగుపాములాంటి విషజంతువుకి బుద్ధిచెప్పేందుకు ముందుగానే సమాయత్తమైంది చంద్రకళ. మామ అరాచకాలను తన ఫోన్‌లో రికార్డు చేసింది.
రాములుకు కుమారుడు అదే గ్రామానికి చెందిన చంద్రకళను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. కుమారుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కోడలు మీద కన్నేసిన కీచక మామ రాములు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొడుకు మానసిక స్థితిని అవకాశంగా తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు కోడలిని లైంగికంగా ఉపయోగించుకోవాలని కుట్రపన్నాడు.
ఆ మృగాడి వేధింపులను భరించలేక మామ రాములుపై దాడి చేసింది కోడలు చంద్రకళ. గాయపడిన రాములును వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పటికే రాములు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆస్థి కోసమే కోడలు చంద్రకళ హత్యచేసిందని రాములు బంధువులు ఆరోపిస్తున్నారు.. కోడలు చంద్రకళ, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.