Viral Photo: కళ్లు చెదిరే పజిల్.. ఈ ఫోటోలో ఉన్న జంతువు ఏంటో కనిపెడితే మీరే గ్రేట్.!
సవాళ్లు ఇష్టపడేవారు ఎప్పుడూ ఏదొక పజిల్‌ను సాల్వ్ చేస్తుంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు పజిల్స్ ఎంతగానో తోడ్పడతాయి.
సవాళ్లు ఇష్టపడేవారు ఎప్పుడూ ఏదొక పజిల్‌ను సాల్వ్ చేస్తుంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు పజిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం.. ఫన్ కోసం ఒక్క క్లిక్ ఇస్తే చాలు.. వీడియోలు, వైరల్ స్టఫ్, ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ లాంటివి ఎన్నో ఇంటర్నెట్‌లో దొరికేస్తాయి. వీటిల్లో ముఖ్యంగా ఫోటో పజిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సండే బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పద సంపత్తి, ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ ఫోటోలను మీరు ఓ పట్టు పట్టేసి ఉంటారు. కానీ అవి అంతా ఒక ఎత్తయితే.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోటో పజిల్స్ మరో ఎత్తు. మరి అలాంటి ఫోటో పజిల్‌కు చెందిన ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది.? కొండ.. ఆ పక్కనే చెట్టు.. చుట్టూ మట్టి.. అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆ ప్రాంతంలో ఓ జంతువు కూడా దాగుంది. అదేంటో చెప్పాలి. మీరు ఫోటోను నిశితంగా చూస్తే 10 సెకన్లలో ఆ జంతువు ఏంటన్నది చెప్పేస్తారు. లేట్ ఎందుకు ఓసారి మీ కళ్లకు పరీక్ష పెట్టి.. ట్రై చేయండి.. ఆ జంతువు ఏంటో చెప్పేయండి.. చాలామంది ఈ ఫోటోలో ఉన్న జంతువు ఏంటో కనిపెట్టేందుకు ట్రై చేశారు. చివరికి ఫెయిల్ అయ్యారు. కొంతమంది కరెక్ట్‌గా చెప్పినప్పటికీ.. చాలామంది పప్పులో కాలేశారు. మరి మీ ఐక్యూ పవర్ ఏంటో టెస్ట్ చేసుకోండి. ఒకవేళ అదేంటో మీరు కనిపెట్టలేకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..
here is the answer.. pic.twitter.com/UdAynfR8RA
— telugufunworld (@telugufunworld) May 16, 2022