Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే ఈ టిఫిన్స్ అస్సలు తినొద్దు! తస్మాత్ జాగ్రత్త.. అవేంటో తెలుసుకోండి!

బిజీబిజీ లైఫ్‌లో ఎప్పుడు నిద్రపోతున్నామో.. మార్నింగ్ ఎప్పుడు మేల్కొంటున్నామో.. అస్సలు తెలియట్లేదు...

Health Tips: ఉదయాన్నే ఈ టిఫిన్స్ అస్సలు తినొద్దు! తస్మాత్ జాగ్రత్త.. అవేంటో తెలుసుకోండి!
Tiffin
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2022 | 10:14 AM

బిజీబిజీ లైఫ్‌లో ఎప్పుడు నిద్రపోతున్నామో.. మార్నింగ్ ఎప్పుడు మేల్కొంటున్నామో.. అస్సలు తెలియట్లేదు. ఈ క్రమంలోనే చాలామంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌ను మిస్ చేస్తుంటారు. మధ్యాహ్నం భోజనాన్ని తినేయొచ్చులే అంటూ అల్పాహారాన్ని బద్దకిస్తారు. అయితే అస్సలు అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఉదయాన్ని తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పోషకాలు నిండిన అల్పాహారాన్ని సేవిస్తే.. ఆ రోజు మొత్తానికి అందాల్సిన ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. పొద్దున్నే కడుపులో ఏదైనా తిండి పడితేనే.. బండి ముందుకు నడవగలదని పెద్దలు కూడా అంటుంటారు. సరైన పోషకాహారం ఉదయం తినకపోతే ఎక్కడ లేని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇక్కడ కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు.

ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెబుతున్నారు. ఆయిల్‌తో చేసిన పూరి, పరోటా వంటి వాటిని అల్పాహారాలుగా తీసుకోవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువ పంచదార వేసిన అల్పాహారం, వైట్ బ్రెడ్‌, రిఫైన్డ్ గ్రైన్స్‌తో తయారు చేసే టిఫిన్స్, ప్రోటీన్ షేక్స్‌కు దూరంగా ఉండాలన్నారు. వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఆయిల్ లెస్ టిఫిన్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని స్పష్టం చేశారు.

Also Read:

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోందో.. ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది!

20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!

మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి!! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!