Cricket: 20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!

Cricket: 20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!
Punjab Kings

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే.. ఇంకేముంది బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయం. ఇక్కడ కూడా అదే జరిగింది.

Ravi Kiran

|

May 14, 2022 | 8:05 AM

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే.. ఇంకేముంది బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయం. ఇక్కడ కూడా అదే జరిగింది. నిన్న ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చిన్న సైజ్ విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్, హైదరాబాద్ మాజీ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.

జానీ బెయిర్‌స్టో(66) తుఫాన్ ఇన్నింగ్స్‌కు పంజాబ్ కింగ్స్ కేవలం 5 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(21) కూడా క్యామియో ఆడటంతో పంజాబ్ జట్టుకు అద్భుతమైన శుభారంభం దక్కింది. యధావిధిగా మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్(70) తనదైన శైలి సిక్సర్ల వర్షం కురిపించగా.. నిర్ణీత ఓవర్లకు పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.

బెయిర్‌స్టో, లివింగ్‌స్టన్ హాఫ్ సెంచరీ:

ఈ సీజన్‌లో జానీ బెయిర్‌స్టో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నెక్స్ట్ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా.? లేదా.? అనే పరిస్థితి వచ్చేసరికి.. తన స్టైల్‌లో విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసేసరికి బెయిర్‌స్టో 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టోకు ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అతని హాఫ్ సెంచరీ కారణంగా పంజాబ్ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 83 పరుగులు చేసింది.

ఇక ఎప్పటిలానే లివింగ్‌స్టన్ బౌలర్లపై మరోసారి విరుచుకుపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా.. అవసరమైనప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌ వరకు క్రీజులో ఉన్న లివింగ్‌స్టన్ 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో లివింగ్‌స్టన్‌కు ఇది 4వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరూ కలిసి బౌండరీల రూపంలో 20 బంతుల్లో 102 పరుగులు చేశారు.. ఇద్దరి ఇన్నింగ్స్‌లను కలిపితే మొత్తంగా 9 ఫోర్లు, 11 సిక్సర్లు వచ్చాయి.

షాబాజ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఔట్..

బెయిర్‌స్టో 29 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 227.59గా ఉంది. షాబాజ్ అహ్మద్‌ వేసిన10వ ఓవర్ తొలి బంతికి షార్ట్ థర్డ్ మ్యాన్ మీద భారీ షాట్‌కు ప్రయత్నించిన బెయిర్‌స్టో.. మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఛాన్స్‌లు..

ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే, జట్లకు 16 పాయింట్లు ఉండటం ముఖ్యం. బెంగళూరు‌పై విజయంతో పంజాబ్ ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో 6వ స్థానంలో ఉంది. మరో 2 మ్యాచ్‌లు పంజాబ్ ఆడాల్సి ఉండగా.. ఆ రెండింటిలోనూ విజయం సాధించడం తప్పనిసరి. ఒకవేళ మిగిలిన జట్లు కూడా అన్ని పాయింట్లతోనే లీగ్ స్టేజి పూర్తి చేస్తే.. అప్పుడు నెట్‌ రన్‌రేట్ పరిగణనలోకి వస్తుంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌పై ఓటమితో బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టం అయ్యాయి. ఇక ఉన్న ఒక్క మ్యాచ్‌లో భారీగా గెలిచినా.. ఇతర జట్ల గణాంకాలపై బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కోహ్లీకి మరోసారి ట్రోఫీని అందుకునే ఛాన్స్ దక్కే అవకాశం కనిపించట్లేదు.

Also Read:

ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోందో.. ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది!

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ ఫోటోలో దాగున్న అద్భుతాన్ని కనిపెట్టండి చూద్దాం.. గుర్తిస్తే మీరే జీనియస్.!

దేశీ ఎయిర్ కూలర్.. ఇలాంటి ఐడియా నెవ్వర్ బెఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే షాకే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu