Viral Video: దేశీ ఎయిర్ కూలర్.. ఇలాంటి ఐడియా నెవ్వర్ బెఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే షాకే!

Viral Video: దేశీ ఎయిర్ కూలర్.. ఇలాంటి ఐడియా నెవ్వర్ బెఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే షాకే!
Desi Juggad

ఇంటర్నెట్ వాడకం పెరిగిన దగ్గర నుంచి చాలామందికి తమలోని ప్రతిభను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ఓ వేదికగా మారింది...

Ravi Kiran

|

May 12, 2022 | 12:54 PM

ఇంటర్నెట్ వాడకం పెరిగిన దగ్గర నుంచి చాలామందికి తమలోని ప్రతిభను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ఓ వేదికగా మారింది. ప్రతిభ ఎవరి సొంతం కాదన్నట్లు.. కొంత మంది ఎలాంటి చదువు లేకున్నా.. ఇంజనీర్లు సైతం షాక్ అయ్యే విధంగా సరికొత్త ఇన్వెన్షన్లు, ఐడియాలను అమలు చేస్తున్నారు. వాటిని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. అక్కడొక టెంట్‌లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఊరిలో చాలామంది వచ్చి అక్కడ చేరుకున్నారు. అసలే ఎండాకాలం.. ఆపై అంతమంది ఒకే చోట ఉంటే.. ఇంకేమైనా ఉందా.! ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సిందే. అయితే ఇక్కడ అలాంటిది ఏం లేకుండా.. వారందరికీ చల్లటి గాలి తగిలే విధంగా ఓ వ్యక్తి ఆ టెంట్ ముందు థ్రెషర్ మెషిన్‌ను అమర్చాడు. ఇక దాని నుంచి వచ్చే చల్లటి గాలిని టెంట్‌లో ఉన్నవాళ్లంతా ఆస్వాదించేలా సెట్ చేశాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ దేశీ జుగాడ్‌ను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ‘థ్రెషర్ గాలి’తో జనాలకు స్వాగతం’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 80 వేలకు పైగా వ్యూస్ రాగా.. దీనిని 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే నెటిజన్లు కూడా వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu