AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కలెక్టరేట్‌‌లో ఒక్కసారిగా గందరగోళం.. ఏం జరిగిందని చూడగా షాకింగ్ సీన్!

మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్‌‌లో మాత్రం పనులు కోసం వచ్చిన జనాలు ఒక్కసారిగా భయపడిపోయారు.. అటూ.. ఇటూ పరుగులు పెట్టారు...

Viral Video: కలెక్టరేట్‌‌లో ఒక్కసారిగా గందరగోళం.. ఏం జరిగిందని చూడగా షాకింగ్ సీన్!
Snake Hulchul
Ravi Kiran
|

Updated on: May 12, 2022 | 12:49 PM

Share

అదొక కలెక్టరేట్. జిల్లా పాలనంతా అక్కడనుంచే జరుగుతుంది. ప్రజలకు ఏ కష్టమొచ్చినా.. వారి సమస్యలన్నింటికి ఇక్కడే న్యాయం దొరుకుతుంది. ఏ జిల్లాలో అయినా కలెక్టర్ ఆఫీస్‌లో జరిగే పనులు ఇవేలెండి. అయితే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే.. మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్‌‌లో మాత్రం పనులు కోసం వచ్చిన జనాలు ఒక్కసారిగా భయపడిపోయారు.. అటూ.. ఇటూ పరుగులు పెట్టారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. మహుబుబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్‌‌లో పాము హాల్‌చల్ చేసింది. తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చిన జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. కలెక్టర్ సీసీ ఛాంబర్‌లోకి నాగుపాము ప్రవేశించడంతో ఒక్కసారిగా ఆ చోట గందరగోళం ఏర్పడింది. దీనితో అక్కడున్న సిబ్బంది.. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. వారు రంగంలోకి దిగి చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి