Hyderabad: పార్కింగ్ చేసిన ఈ- బైక్ లో మంటలు.. ఉలిక్కిపడ్డ స్థానికులు
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు(Electrical Vehicles) అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనలతో....
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు(Electrical Vehicles) అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనలతో ఈ-వాహనాలను నడిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) ఎల్బీనగర్ చౌరస్తాలో ఇలాంటి ఘటనే జరిగింది. చౌరస్తా వద్ద ఉన్న పై వంతెన కింద బుధవారం రాత్రి ఈ -బైక్ అకస్మాత్తుగా తగలబడింది. సాధారణంగా ఇక్కడ పై వంతెన కింది స్థలంలో బైక్ లను పార్కింగ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి నిలిపిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకునే లోపే వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు, వాహనం ఎవరిదో అన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తమకు ఎవరి నుంచీ, ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఈ-వాహనాలలో అగ్ని ప్రమాదం ఘటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తామని వెల్లడించింది. నిర్దిష్ట టెంపరేచర్ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే.. కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
India Covid-19: దేశంలో పెరిగిన కరోనా రికవరీలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?