David Warner: ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో డేవిడ్‌ వార్నర్.. 427 పరుగులతో మూడో స్థానానికి చేరిన డీసీ ఆటగాడు..

ఐపీఎల్ 2022(IPL 2022) తుది దశకు చేరుకుంది. దీంతో ఆరెంజ్‌ క్యాప్‌(Orange Cap) ఎవరు గెలుచుకుంటారో ఆసక్తి నెలకొంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో దూసుకెళ్తున్నాడు...

David Warner: ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో డేవిడ్‌ వార్నర్.. 427 పరుగులతో మూడో స్థానానికి చేరిన డీసీ ఆటగాడు..
David Warner
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 12, 2022 | 8:40 AM

ఐపీఎల్ 2022(IPL 2022) తుది దశకు చేరుకుంది. దీంతో ఆరెంజ్‌ క్యాప్‌(Orange Cap) ఎవరు గెలుచుకుంటారో ఆసక్తి నెలకొంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో దూసుకెళ్తున్నాడు.  అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలోకి చేరుకున్నాడు. మొదటి స్థానంలో జోస్‌ బట్లర్ ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరు 12 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్‌ 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్‌ రాహుల్‌కు దగ్గరగా ఉన్నా.. బట్లర్‌కు మాత్రం 198 పరుగుల దూరంలో ఉన్నాడు. వార్నర్‌కు ఆరెంజ్‌ క్యాప్‌ రావాలంటే.. బట్లర్‌ మిగతా మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులు చేస్తేనే సాధ్యం అయ్యే అవకాశం ఉంది.

వార్నర్‌ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు. రాజస్థాన్‌పై 41 బంతుల్లో 52 పరుగుల అజేయంగా నిలిచాడు. డేవిడ్ వార్నర్ IPL 2022లో రాజస్థాన్‌పై అజేయంగా 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 400 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 8వ సారి 400 ప్లస్ పరుగులు సాధించాడు. అంతకుముందు అతను 2013 నుంచి 2017 వరకు నిరంతరంగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 2019, 2020లో కూడా 400+ పరుగులు చేశాడు. ఇప్పుడు 2022లో కూడా మరోసారి ఈ ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. అతను 2016 సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేశాడు. బట్లర్‌.. కోహ్లీ రికార్డును దాటాలంటే 346 పరుగులు చేయాలి. ఒకవేళ రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు వెళ్తే.. బట్లర్‌కు రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

Read Also.. IPL 2022: సజీవంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌ ఆశలు.. రాజస్థాన్‌పై విజయంతో 5వ స్థానానికి పంత్ సేన..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!