AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఆమె ఆయనలో సగభాగం.. కష్టంలో తోడు ఉండి ఆదర్శంగా నిలిచిన భార్య

భర్తను బ్రతికించు కోవడానికి.. లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65 శాతం మేర తీసిన ..

Khammam: ఆమె ఆయనలో సగభాగం.. కష్టంలో తోడు ఉండి ఆదర్శంగా నిలిచిన భార్య
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 21, 2024 | 1:37 PM

Share

భార్య, భర్తల బంధం .. ఎప్పటికీ ఆదర్శంగా నిలిచేలా ఉండాలి.. నేడు మారుతున్న సమాజంలో చిన విషయాలకే మనస్పర్థలు, గొడవలతో దూరం అవుతున్నారు. అర్థం చేసుకునే ఓపిక ,ఆలోచన ఉండటం లేదు. కష్టాలు, సమస్యలు వస్తే కుంగిపోవడం, బాధ పడుతున్నారు.పెళ్లి జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ భార్య తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకు లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీనితో ఆ దంపతులు ఆందోళన చెందారు. పలు ఆసుపత్రులకు తిరిగి చికిత్స చేయించు కొన్నారు. లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు.

భర్తను బ్రతికించు కోవడానికి.. లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దంపతు లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు. సంతోషం, సుఖాల్లోనే కాదు.. కష్టాల్లో తోడుగా నిలిచి.. భర్తను కాపాడుకుంది. భార్య లావణ్య ను పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి