Telangana: చావు ఇంటికి వచ్చి మద్యం తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి.. ఆ తర్వాత బయడపడ్డ షాకింగ్ నిజం
బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న సగం మందు.. దినకర్మల రోజు మృతుడికి వరసకు బావ అయిన వ్యక్తి సేవించి అతను కూడా వాంతులు అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని తన బావతో కలిసి మద్యం సీసాలో పాయిజన్ కలిపి కట్టుకున్న భర్తను హతమార్చింది భార్య..ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని పేట చెరువు గ్రామంలో బుట్టల నరేష్ ఫిబ్రవరి 10న మద్యం సేవించిన అనంతరం.. వాంతులు అవడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకుని వచ్చారు.. అనంతరం మరుసటి రోజు కూడా వాంతులు అయి మృతి చెందాడు. ఆపై కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న సగం మందు.. దినకర్మల రోజు మృతుడికి వరసకు బావ అయిన వ్యక్తి సేవించి అతను కూడా వాంతులు అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు బుట్టల నరేష్ కల్తీ మద్యం సేవించి మృతి చెందాడని తెలపడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఖననం చేసిన మృతదేహాన్ని తాసిల్దార్ సమక్షంలో వెలికి తీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులో పాయిజన్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. తమదైన స్టైల్లో కేసు విచారణ చేసిన పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలిశాయి.
బుట్టల నరేష్ తన భార్య రజిత మధ్య తరచూ గొడవలు జరిగాయని.. ఈ గొడవలకు కారణం రజిత వరుసకు బంధువైన గద్దల సాంబశివరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం అని నిర్ధారణకు వచ్చారు. దీంతో గద్దల సాంబశివరావుతో కలిసి భార్య రజిత తన భర్తని హతమార్చాలనుకుంది. ఈ నేపథ్యంలోనే సారపాకలో ఫిబ్రవరి 10 న తన బంధువుల వివాహానికి హాజరయ్యాడు బుట్టల నరేష్. ఆ సమయంలో గద్దల సాంబశివరావు, తనకు తెలిసిన తాటి నరేష్ అనే వ్యక్తి ద్వారా ఒక మద్యం బాటిల్ కొన్నాడు. అప్పటికే ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన పురుగుల మందును ఆ మద్యంలో కలిపారు. వేడుక అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా గద్దల సాంబశివరావు.. తాటి నరేష్ ద్వారా బుట్టల నరేష్‌కు ఈ మద్యం సీసా ఇచ్చి తాగమన్నాడు.. ఆ మద్యం సీసా తీసుకున్న బుట్టల నరేష్ తన స్వగ్రామైన పాల్వంచకు వచ్చి ఆ రోజు రాత్రి మద్యం సీసాలో ఉన్న సగం లిక్కర్ తాగాడు. లిక్కర్ దాగిన అనంతరం కొద్దిసేపటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి వాంతులు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.. తర్వాత రోజు అతను మృతి చెందాడు.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం అలవాటు ఉన్న తన భర్తను ఎవరికి అనుమానం రాకుండా హతమార్చింది భార్య. కానీ మృతుడికి వరసకు బావైన వ్యక్తి.. ఆ మిగిలిన లిక్కర్ తాగి.. అనారోగ్యం పాలవ్వడంతో.. ఎక్కడో తేడా కొట్టింది. మృతుడి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో… విచారణలో ఈ వివాహేతర సంబంధం వెలుగుచూసింది పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.. బుట్టల నరేష్‌ను పథకం ప్రకారం చంపిన ఘటనలో పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన గద్దల సాంబశివరావు.. అతడికి సహకరించిన వెంకటాపురం గ్రామం ములుగు జిల్లాకు చెందిన తాటి నరేష్, మృతుడి భార్య బుట్టల రజితను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..