Peddapalli: ఊపిరాడకుండా చేసి.. పాముతో కాటు వేయించి.. కట్టుకున్న భార్యే ఇలా చేసిందేంటీ..!

Telangana: పోలీసుల సమాచారం మేరకు.. ఈనెల తొమ్మిదిన రాత్రి 11 గంటల సమయంలో మచ్చ సురేష్ &టీమ్ ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. సురేష్ బెడ్ షీట్ ప్రవీణ్ పైన కప్పి దిండుతో అదిమి పట్టుకొని ఊపిరి ఆడకుండా చేయగా, మిగితా మిత్రులు కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. ప్రవీణ్ చనిపోయాడో లేదో అన్న సందేహంతో పాముతో కూడా కాటు వేయించారు. అనంతరం చనిపోయాడని నిర్దారించుకున్నాక అక్కడ నుండి వెళ్లిపోయారు. తెల్లవారుజామున ప్రవీణ్ కు గుండెపోటు వచ్చిందంటూ భార్య లలిత ఇరుగుపొరుగు వారిని నమ్మిస్తూ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆ తర్వాత..

Peddapalli: ఊపిరాడకుండా చేసి.. పాముతో కాటు వేయించి.. కట్టుకున్న భార్యే ఇలా చేసిందేంటీ..!
Builder Murder Case
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 14, 2023 | 12:55 PM

పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 14; తలపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. తట్టుకోలేక ఆ వ్యక్తి మరణించినా.. చావలేదేమోనన్న అనుమానంతో పాముతో కాటు వేయించారు. ఇంత కిరాతకంగా జరిగిన హత్యకు ప్రధాన కారణం కట్టుకున్న భార్యే కావడం సంచలనం సృష్టించింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ దారుణం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన కొప్పెర. ప్రవీణ్ విలేకరిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా,బిల్డర్ గా ఎదిగాడు. ఈ క్రమంలో ఒక మహిళలతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధం ఏర్పడడం దంపతుల మధ్య కలహానికి దారి తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రవీణ్ మద్యంకు బానిసై రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఇదంతా భరించలేని భార్య లలిత, తన భర్త వద్ద సెంట్రింగ్ పనిచేసే మచ్చ సురేష్ తో తన బాధలను ఏకరువు పెట్టింది.భర్త పెట్టె పోరు నుండి తనకు విముక్తి కలిపిoచాలని ప్రాదేయపడింది. దీంతో ఇరువురు కలిసి ప్రవీణ్ ను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలా చేస్తే తన కుటుంబం సమస్యల్లో పడుతుందని సురేష్ ఆందోళన చెందగా, అందుకు ప్రతిఫలంగా తన వద్ద ఉన్న ఒక ప్లాట్ ను రాసిచ్చేందుకు లలిత సిద్ధపడింది.

ఈ క్రమంలో ప్రవీణ్ ను చంపడానికి సిద్ధపడ్డ సురేష్,ఈ హత్యను సహజ మరణమని నమ్మించేలా ఊపిరాడకుండా చేసి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ప్రవీణ్ ప్రతిఘటిస్తే పాముతో కాటేసి చంపాలని కూడా వ్యూహరచన చేసుకున్నాడు. ఈ హత్య కోసం సురేష్ రామగుండంకు చెందిన ఇందారపు సతీష్, మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్, భీమ గణేష్ లతో కలిసి పతకం రచించాడు. పాముతో కాటేయించాలనే పథకం మేరకు మందమర్రి కి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నన్నపురాజు చంద్రశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో వీరి ఖర్చులకోసం లలిత 34 g బంగారు గొలుసును నజరానాగా ఇచ్చింది.

ఇలా వీరంతా కలిసి పథకం ప్రకారం రామగుండంలో మద్యం సేవించి ప్రవీణ్ కదలికపై ఫోన్ ద్వారా లలితను ఆరా తీశారు . ప్రవీణ్ మద్యం సేవించి వచ్చి నిద్రిస్తున్నట్లు లలిత ఇచ్చిన సమాచారంతో, ఈనెల తొమ్మిదిన రాత్రి 11 గంటల సమయంలో మచ్చ సురేష్ &టీమ్ ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు, సురేష్ బెడ్ షీట్ ప్రవీణ్ పైన కప్పి దిండుతో అదిమి పట్టుకొని ఊపిరి ఆడకుండా చేయగా, మిగితా మిత్రులు కాళ్ళను గట్టిగా పట్టుకొన్నారు. ప్రవీణ్ చనిపోయాడో లేదో అన్న సందేహంతో పాముతో కూడా కాటు వేయించారు. అనంతరం చనిపోయాడని నిర్దారించుకున్నాక అక్కడ నుండి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

తెల్లవారుజామున ప్రవీణ్ కు గుండెపోటు వచ్చిందంటూ భార్య లలిత ఇరుగుపొరుగు వారిని నమ్మిస్తూ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్లు హాస్పిటల్ వైద్యులు నిర్దారించారు.ప్రవీణ్ కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఈ మృతిపై ప్రవీణ్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో డొంకంతా కదిలింది. భార్య లలిత పోలీసు విచారణలో తానే చంపానంటూ కథ మొత్తం వివరించింది.దీంతో పోలీసులు భార్య లలిత సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..