Gold World Cup Trophy: బంగారంతో తయారు చేసిన ప్రపంచ కప్ ట్రోఫీ.. అందరినీ ఆకట్టుకుంటోంది.. వీడియో హల్‌చల్
ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రవూఫ్ షేక్ పేరు నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే, తాను ఈ బంగారు ట్రోఫీని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందన్నాడు. ఈ రికార్డుతో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన రికార్డు కూడా సృష్టిస్తుందని రవూఫ్ సంతోషంగా చెప్పారు. మూడోసారి ప్రపంచకప్ ట్రోఫీ డిజైన్ తరహాలో గోల్డ్ ట్రోఫీని తయారు చేశానని చెప్పాడు. 1983, 2011 తర్వాత 2023లో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించాలని భావిస్తున్నారు.
క్రికెట్ ప్రపంచ కప్ 2023 హవా కొనసాగుతోంది. అక్టోబర్ 14 శనివారం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య పోరు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ఔత్సాహికులు తమ ఆటపై తమ ప్రేమను ప్రదర్శిస్తూ తమదైన ప్రత్యేక మార్గాల్లో భారత జట్టుకు మద్దతునిస్తున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌కు చెందిన రౌఫ్ షేక్ అనే నగల వ్యాపారి 0.9 గ్రాముల బంగారు ప్రపంచ కప్ ట్రోఫీని తయారు చేశాడు. 2014 సంవత్సరంలో రవూఫ్ 1.200 గ్రాముల బరువుతో ప్రపంచ కప్ ట్రోఫీని చేసాడు. 2019 లో అతను 1 గ్రాము బరువుతో ట్రోఫీని తయారు చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. 2014లో తాను 1.200 గ్రాముల ప్రపంచ కప్ ట్రోఫీని తయారు చేశానని, 2019లో 1 గ్రాము ట్రోఫీని తయారు చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టానని రౌఫ్ షేక్ తెలియజేశాడు. ఇప్పుడు 2023లో 0.900 గ్రాముల బరువున్న ట్రోఫీని తయారు చేసినట్టుగా వెల్లడించాడు.. తదుపరి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అవకాశం వస్తే, ఈ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అందజేస్తానని చెప్పాడు.
ఇంత తక్కువ బరువులో బంగారంతో తయారు చేసిన ట్రోఫీ గురించి రవూఫ్ షేక్ వివరిస్తూ.. బంగారంతో తయారు చేసిన తక్కువ బరువుతో ప్రపంచ కప్ ట్రోఫీని తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేయాలన్నది తన కోరిక అన్నారు. రవూఫ్ చెప్పిన మాటల ప్రకారం, లండన్‌లో జరిగే ప్రపంచ కప్ ట్రోఫీ 0.950 మి.గ్రా బరువుతో అత్యంత తేలికైనది. అందుకే తాను 0.900 mg బరువుతో బంగారు ట్రోఫీని తయారు చేశానని చెప్పాడు. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రవూఫ్ షేక్ పేరు నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే, తాను ఈ బంగారు ట్రోఫీని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందన్నాడు. ఈ రికార్డుతో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన రికార్డు కూడా సృష్టిస్తుందని రవూఫ్ సంతోషంగా చెప్పారు. మూడోసారి ప్రపంచకప్ ట్రోఫీ డిజైన్ తరహాలో గోల్డ్ ట్రోఫీని తయారు చేశానని చెప్పాడు. 1983, 2011 తర్వాత 2023లో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించాలని భావిస్తున్నారు.
#WATCH | Gujarat: A jeweller in Ahmedabad has made a gold World Cup trophy weighing 0.9 grams
Jeweller Rauf Sheikh says, “In 2014, I made a World Cup trophy weighing 1.200 grams and in 2019, I broke my own record by making a 1-gram trophy. Now in 2023, I have made a trophy… pic.twitter.com/h7Pyywhva7
— ANI (@ANI) October 12, 2023
ఎరుపు రంగుతో ఏర్పాటు చేసిన తివాచీపై బంగారంతో చేసిన వరల్డ్‌కప్ చిన్న ప్రతిరూపాన్ని పెట్టి చక్కటి వీడియోని తీశారు..ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. ఈ వీడియో అక్టోబర్ 13న ఇంటర్‌నెట్‌లో షేర్ చేయగా… అప్పటి నుంచి దాదాపు 52,000 వీక్షణలు వచ్చాయి. ఈ షేర్ దాదాపు 600 లైక్‌లను కూడా సాధించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..