ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ అజయ్‌ కంటిన్యూ..

కనుచూపు మేరలో యుద్ధాన్ని చూసిన క్షణాలు వాళ్లనింకా వెంటాడుతున్నాయి. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు తిరిగొచ్చిన భారతీయులు. ఐనా... ఇజ్రాయిల్‌లో యుద్ధవాతారణం కొత్త కాదు. అక్కడ నిత్యం టెన్షన్లే. దానికి తగ్గట్టు జనాన్ని మెంటల్‌గా ఫిజికల్‌గా తయారు చేసుకుంది అక్కడి ప్రభుత్వం. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటై ఉంటుంది. తమ దేశంపైకి వచ్చే మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసేలా అక్కడ 'ఐరన్ డోమ్' అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం రెండేళ్లు ఆర్మీలో పనిచేయాలన్న నిబంధన కూడా ఉంది.

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర పోరు.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ అజయ్‌ కంటిన్యూ..
Operation Ajay
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 14, 2023 | 12:26 PM

ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య భీకరయుద్దం కంటిన్యూ అవుతుంది. రెండు దేశాల మధ్య రోజురోజుకీ పరిస్థితి విషమంగా మారుతుంది. మొదట్లో హమస్ ఇజ్రాయెల్ మీద తెగబడితే.. దానికి కౌంటర్‌గా ఇప్పుడు ఇజ్రాయెల్‌ గాజా ప్రాంతాన్ని ఛిద్రం చేస్తోంది. దాడులు-ప్రతిదాడులతో ఇజ్రాయెల్‌లో జనజీవితాలు ‌ప్రశ్నార్థకంగా మారాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న వార్‌తో ఇజ్రాయెల్‌లో ఉంటున్న ఇండియన్ల ప్యూచర్‌ ఆందోళనగా మారింది. ఇజ్రాయల్ ఉన్న ఇండియన్స్‌ను రప్పించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది కేంద్రం‌. యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులకు చేయూత నిస్తుంది. ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. నిన్న ఇజ్రాయెల్‌ టూ న్యూఢిల్లీ 212 మందితో తొలి ప్రత్యేక విమానం సురక్షితంగా చేరుకొగా.. ఇవాళ ఉదయం 235 మందితో ఆపరేషన్ అజయ్ రెండో విమానం ఢిల్లీ చేరుకుంది.

ఆపరేషన్ అజయ్‌లో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయిల్ నుంచి భారత్ కు తరలిస్తున్న భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులకు సహాయం అందిస్తుంది. ఏపీ భవన్‌ లో భోజన, వసతి సదుపాయాలు. అనంతరం విమాన ప్రయాణ ఏర్పాట్లు, హాయ చర్యల బాధ్యతలు చేపట్టింది ఏపీఎన్ఆర్టీఎస్. భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేలమంది భారతీయులు ఉన్నారు. వీరిలో 14 వేల మంది కేర్‌టేకర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు. వాళ్లను స్వదేశానికి తరలించేందుకు మన విదేశాంగ శాఖ చేసిన ఏర్పాటే.. ఆపరేషన్ అజయ్. ఉద్రిక్తతలు పెరగడంతో ఈనెల 7 నుంచి ఇజ్రాయెల్‌కి వచ్చేపోయే ప్యాసింజర్, కమర్షియల్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండియాకు తిరిగి రావాలనుకునేవాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లోనే ఆపరేషన్ అజయ్‌ని షురూ చేసింది మన విదేశాంగ శాఖ.

ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ వెళ్లిన మొదటి ఎయిరిండియా ప్రత్యేక విమానం ఇవాళ ఉదయమే న్యూఢిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 212 మంది భారతీయులతో తిరిగొచ్చింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. వీళ్లందరి ప్రయాణ ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. అవసరమైతే నావీ షిప్స్‌ ద్వారా కూడా ఇజ్రాయెల్ నుంచి మనవాళ్లను తీసుకొస్తామంటోంది విదేశాంగ శాఖ. టెల్‌అవీవ్, రమల్లా ప్రాంతాల్లో 24 గంటలూ పనిచేసే కంట్లోర్ రూమ్స్‌ ఏర్పాటయ్యాయి. ఇండియాకు ఎవ్వరు రావాలనుకున్నా వెంటనే సంప్రదించే ఛాన్సుంది.

ఇవి కూడా చదవండి

కనుచూపు మేరలో యుద్ధాన్ని చూసిన క్షణాలు వాళ్లనింకా వెంటాడుతున్నాయి. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు తిరిగొచ్చిన భారతీయులు. ఐనా… ఇజ్రాయిల్‌లో యుద్ధవాతారణం కొత్త కాదు. అక్కడ నిత్యం టెన్షన్లే. దానికి తగ్గట్టు జనాన్ని మెంటల్‌గా ఫిజికల్‌గా తయారు చేసుకుంది అక్కడి ప్రభుత్వం. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటై ఉంటుంది. తమ దేశంపైకి వచ్చే మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసేలా అక్కడ ‘ఐరన్ డోమ్’ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం రెండేళ్లు ఆర్మీలో పనిచేయాలన్న నిబంధన కూడా ఉంది. దాడులను ఎదుర్కొనే నైపుణ్యం, శారీరక సన్నద్ధత అందరిలో ఉంటుంది. ప్రతి భవనంలో ఇనుప గోడలతో నిర్మించిన షెల్టర్లు, అండర్‌గ్రౌండ్‌లో బంకర్లు ఉంటాయి. ఏదైనా మిస్సైల్ ప్రయోగం జరిగితే చాలు వెంటనే సైరన్లు మోగుతాయి. మొబైల్ ఫోన్లలో అలర్ట్ మెసేజ్ వస్తుంది. నిమిషంలోపే షెల్టర్లలోకి చేరుకోవచ్చు. మిస్సైల్ పడినా సరే ఎటువంటి ప్రాణనష్టం జరగదు. అయినా ప్రాణాలు అరచేత బట్టుకుని బతకాల్సిన దురవస్థ మాత్రం తప్పదు.

కానీ… సరిహద్దులకు దూరంగా ఉన్నవాళ్లు కొంతలోకొంత సేఫ్. ప్రస్తుతానికి జనజీవనం సాధారణంగానే కనిపించినా.. రేపటి పరిస్థితి మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇజ్రాయెలీలకైతే ఎటువంటి పరిస్థితుల్నయినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. బైటి దేశాలనుంచి వచ్చినవాళ్ల దగ్గర అంత తెగింపు ఉండదు. అందుకే.. ఎప్పుడెప్పుడు ఇండియాకు తిరిగొచ్చేద్దామా అని ఎదురుచూశారు. వాళ్లకు దొరికిన అసరా పేరే ఈ ఆపరేషన్ అజయ్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..