Weather Report: తెలుగురాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు శీతలగాలులు..పెరగనున్న చలి తీవ్రత.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్త అంటున్న అధికారులు
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాల్లో..
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణాలో పలు జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత పెరగనున్నదని వెల్లడించారు. చలి గాలుల తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
చలిగాలులు మరో మూడు రోజుల పాటు వీచనున్నాయని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలై.. శీతలగాలులు భారీగా వీస్తాయని పేర్కొన్నారు. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లా మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: తనదైన శైలిలో అందరినీ పరుగులు పెట్టించి.. సీఎం జగన్‌కు పుట్టిన రోజులు చెప్పిన ఎంపీ గోరంట్ల మాధవ్..