TRS – BJP: ఢిల్లీలో వేడెక్కిన వరి కొనుగోళ్ల రాజకీయం.. కేంద్ర మంత్రితో భేటీ కోసం బీజేపీ, టీఆర్ఎస్ నేతల పోటీ..
వింటర్ సీజన్‌లో తెలంగాణ వరి రాజకీయం ఢిల్లీలో సెగలు రేపుతోంది. కేంద్రమంత్రితో భేటీ కోసం పోటాపోటీ నడుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం పంట కొనుగోళ్లపై సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కేంద్రమంత్రి..
TRS – BJP: వింటర్ సీజన్‌లో తెలంగాణ వరి రాజకీయం ఢిల్లీలో సెగలు రేపుతోంది. కేంద్రమంత్రితో భేటీ కోసం పోటాపోటీ నడుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం పంట కొనుగోళ్లపై సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కోసం రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే… బీజేపీ నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు పీయూష్ గోయల్‌తో బీజేపీ నేతలు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొంటారు. వరి కొనుగోళ్లపై రాష్ట్రం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు నిన్నటి నుంచి ఆయన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రజాప్రతినిధులు. బీజేపీ నేతలతో భేటీ తర్వాత టీఆర్‌ఎస్ నేతలకు కేంద్రమంత్రి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..
Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..