CM Jagan Birthday: తనదైన శైలిలో అందరినీ పరుగులు పెట్టించి.. సీఎం జగన్‌కు పుట్టిన రోజులు చెప్పిన ఎంపీ గోరంట్ల మాధవ్..

CM Jagan Birthday: నిత్యం ఏదో ఒక మాట లేక చేతలతో వార్తల్లో నిలిచే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి అందర్నీ పరుగులు పెట్టించారు. తెల్లవారు జామున శరీరం గడ్డ గడ్డే చలిలో..

CM Jagan Birthday: తనదైన శైలిలో అందరినీ పరుగులు పెట్టించి.. సీఎం జగన్‌కు పుట్టిన రోజులు చెప్పిన ఎంపీ గోరంట్ల మాధవ్..
Madhav Cm Jagan
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2021 | 11:49 AM

CM Jagan Birthday: నిత్యం ఏదో ఒక మాట లేక చేతలతో వార్తల్లో నిలిచే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి అందర్నీ పరుగులు పెట్టించారు. తెల్లవారు జామున శరీరం గడ్డ గడ్డే చలిలో టీషర్ట్, నిక్కర్ ధరించి రోడ్డు పై పరుగులు తీశారు. ఆయన వెంట గన్ మెన్ లు కాన్వాయి, అనుచరులు కూడా పరుగులు తీశారు. ఎక్కడా ఆగకుండా మూడు కిలోమీటర్ల మేర ఈ పరుగు సాగింది. అసలు ఎందుకు ఈ పని చేశారంటే.. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఆయన ఇలా చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయమ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. అయితే ఇక్కడ 3కే రన్ ఏర్పాటు చేశారు. మంత్రి శంకర్ నారాయణ 3కే రన్ ను ప్రారంభించగానే ఎంపీ గోరంట్ల మాధవ్ వాయు వేగంతో పరుగు తీశారు. టీషర్ట్, నిక్కర్ ధరించి.. వణికిస్తున్న చలిని లెక్క చేయకుండా పుట్టపర్తి నుంచి ఎయిర్ పోర్ట్ వరకు ఆగకుండా పరుగు తీశారు. ఆయన పరిగెడుతుంటే.. వెనుక గన్ మెన్ లు, అనుచరులుకూడా కదిలారు. అందరికన్నా మాధవ్ ముందుగా పరుగు లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.

Also Read:  కొత్త ఏడాదిలో ఏర్పడే చంద్రగ్రహణాలు.. సమయం, తేదీ సహా పూర్తి వివరాలు..