Rain Alert: చల్లని కబురు.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..

Telangana Rain Alert: ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా భానుడు ప్రతాపంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలతో వెడెక్కిన రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ

Rain Alert: చల్లని కబురు.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..
Rain Alert
Follow us

|

Updated on: Apr 14, 2021 | 3:23 PM

Telangana Rain Alert: ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా భానుడు ప్రతాపంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలతో వెడెక్కిన రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మరో మూడు రోజులపాటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారలు తెలిపారుఉ. బుధవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. గురువారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం నుంచి బుధవారం కురిసిన అకాల వర్షం నష్టాన్ని మిగిల్చింది. పిడుగు పాటు ఘటనలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురికిపైగా మృత్యువాత పడ్డారు. పలుచోట్ల మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. ధాన్యం, మిర్చి తడిసి ముద్దయింది. అయితే.. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలుచోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also Read:

Maharashtra Coronavirus : మహారాష్ట్రలో ఈ రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ తరహా నిబంధనలు, కరోనా కట్టడికి మరాఠా పాట్లు