CBSE 10th Exam 2021 Cancelled: కేంద్రం కీలక నిర్ణయం.. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు..
CBSE 10th Exam 2021 Cancelled: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

CBSE 10th Exam 2021 Cancelled: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కోవిడ్ పరిస్థితుల అనంతరం ఈ పరీక్షలపై జూన్‌లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షన్నరకుపైగా కేసులు నమోదవున్నాయి. ఈ క్రమంలో బోర్డు పరీక్షలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పలువురు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్షలు కోవిడ్ హాట్‌స్పాట్ సెంటర్లుగా మారుతాయని.. రద్దు చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పరీక్షలను రద్దు చేయాలని కోరారు.
కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అధికారులతో సమీక్షించారు. బుధవారం ఆయన కోవిడ్ పరిస్థితులను పరిశీలించి పరీక్షలపై కీలక సూచనలు చేశారు. దీనిలో భాగంగా కేంద్ర విద్యాశాఖ, సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యూకేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కోంది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. జూన్ 1న పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీపై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలకు 15 రోజుల వ్యవధి ఉండేలా ముందు నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ, సీబీఎస్‌ఈ వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Board Exams for Class 10th cancelled & 12th postponed. Results of Class 10th will be prepared on the basis of an objective criterion to be developed by the Board. Class 12th exams will be held later, the situation will be reviewed on 1st June by the Board: Ministry of Education pic.twitter.com/ljVuUkEChB
— ANI (@ANI) April 14, 2021
Also Read: