DGP Mahender Reddy : తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : డీజీపీ మహేందర్​ రెడ్డి

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డీజీపీ మహేందర్​ రెడ్డి చెప్పారు. మావోయిస్టుల నియామకాలను అడ్డుకుంటామని తెలిపారు...

DGP Mahender Reddy : తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : డీజీపీ మహేందర్​ రెడ్డి
DGP Mahender Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 28, 2021 | 11:47 PM

Maoist-free state : తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డీజీపీ మహేందర్​ రెడ్డి చెప్పారు. మావోయిస్టుల నియామకాలను అడ్డుకుంటామని తెలిపారు. అటవీ ప్రాంతంలో నిరంతరం కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వివరించారు. కమ్యూనిటీ పోలీస్ ద్వారా ప్రజలకు నిరంతరం దగ్గరవడానికి కృషి చేస్తున్నారు. మావోల కట్టడి ఆపరేషన్​లో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాంతి భద్రతలకు నిలయంగా మారాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కట్టడికి 31 డిస్ట్రిక్ట్​ గార్డ్స్​ ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే వైద్య సేవలు అందిస్తామని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులను వారికే ఇస్తామని తెలిపారు. మావోల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని లొంగిపోయేలా చూడాలని సూచించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం పర్యటించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి రివార్డ్స్ అందించారు.

మావోయిస్టు సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పిన మహేందర్ రెడ్డి.. కొవిడ్​ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తెలంగాణ స్టేట్​ కమిటీ సెక్రటరీ హరిభూషన్​ కొవిడ్​తో మృతి చెందాడు. ఇప్పటికే ఎంతోమంది క్యాడర్స్​ మృతి చెందారు. వారితో పాటు మిగిలినవారు చనిపోకుండా ఉండాలంటే జనజీవన స్రవంతిలో కలవాలి అని మావోలకు డీజీపీ సూచించారు.

Read also : CM KCR : సీఎం కేసీఆర్ చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగింది : దళిత మేథావులు.. నేతలు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?