Watch Video: హన్మకొండలో దారుణం.. పొద్దున్నే రోడ్డు ఊడ్చుతున్న మహిళపైకి దూసుకెళ్లిన కారు! వీడియో
రెక్కాడితేగానీ డొక్కాడని పేద బ్రతుకులు వారివి. ఎండెనక, వానెనక.. పగలు, రాత్రి తేడాలేకుండా కష్టించి పనిచేసుకుని జీవనం సాగించే అభాగ్యుల బతుకులంటే కొందరు మదమెక్కిన ధనవంతులకు పరిహాస్యం. తాజాగా ఓ రోడ్డు పక్కన చీపురుతో ఊడ్చుతున్న కార్మికురాలిని కారులో వెళ్తున్న ఓ బడా బాబు తన వాహనంతో నిర్ధాక్షిణ్యంగా ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన ఆ అభాగ్యురాలు ఆర్తానాదాలు చేస్తూ..
హన్మకొండ, సెప్టెంబర్ 10: రెక్కాడితేగానీ డొక్కాడని పేద బ్రతుకులు వారివి. ఎండెనక, వానెనక.. పగలు, రాత్రి తేడాలేకుండా కష్టించి పనిచేసుకుని జీవనం సాగించే అభాగ్యుల బతుకులంటే కొందరు మదమెక్కిన ధనవంతులకు పరిహాస్యం. తాజాగా ఓ రోడ్డు పక్కన చీపురుతో ఊడ్చుతున్న కార్మికురాలిని కారులో వెళ్తున్న ఓ బడా బాబు తన వాహనంతో నిర్ధాక్షిణ్యంగా ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన ఆ అభాగ్యురాలు ఆర్తానాదాలు చేస్తూ విలపించింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
హనుమకొండ – అంబేద్కర్ సర్కిల్ నుంచి ఓల్డ్ బస్ డిపో వెళ్లే రోడ్డులో పీహెచ్ వర్కర్ రామంచ సమ్మక్క చీపురుతో రోడ్డు పక్కన ఊడ్చుతూ ఉంది. ఇంతలో స్పీడ్‌గా వచ్చిన ఓ కారు రామంచ సమ్మక్కకు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డు పక్కనున్న డివైడర్‌పై పడి ఆర్తనాదాలు పెడుతూ హృదవ విదారకంగా విలపించింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను అదే రోడ్డుపై వెళ్తున్ వాహనదారులు సైతం పట్టించుకోలేదు. ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను పైకి లేపి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హన్మకొండలోని అంబేద్కర్ సర్కిల్ నుండి పాత బస్ డిపోకు వెళ్లే రహదారిపై శనివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ తన కారుతో మహిళను ఢీకొట్టిన అనంతరం అతడు అక్కడి నుండి పారిపోయాడు. గాయాలపాలైన మహిళకు సహాయం చేయడానికి కూడా ఆగలేదు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి పోలీసు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వీడియో దృశ్యాలను చూస్తే.. డ్రైవర్ ఉద్దేశ్యపూర్వకంగా మహిళను ఢీ కొట్టినట్లు తెలుస్తుంది.