AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గదిలో ఏదో వింత శబ్ధం.. ఏంటా అని తొంగి చూడగా గుండె గుభేల్! ఊరు ఊరంతా పరుగులే.. వీడియో

Ibrahimpatnam python news: ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. నిత్యం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వచ్చేది శీతాకాలం. ఈ కాలంలో వెచ్చదనం కోసం విష సర్పాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నాఊహించని నష్టం జరిగిపోతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అలాంటి ఘటన చోటు చేసుకుంది..

Watch Video: గదిలో ఏదో వింత శబ్ధం.. ఏంటా అని తొంగి చూడగా గుండె గుభేల్! ఊరు ఊరంతా పరుగులే.. వీడియో
Massive Python Entered A Venture In Ibrahimpatnam
Srilakshmi C
|

Updated on: Nov 02, 2025 | 9:24 AM

Share

ఇబ్రహీంపట్నం, నవంబర్‌ 2: ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. నిత్యం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వచ్చేది శీతాకాలం. ఈ కాలంలో వెచ్చదనం కోసం విష సర్పాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. తాజాగా ఓ ఇంట్లోకి ఏకంగా కొండ చిలువ దూరేసింది. దీంతో ఊరుఊరంతా పరుగులు తీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామ సమీపంలో ఉన్న వెంచర్లో గత కొంతకాలంగా సముద్రాల అంజయ్య, గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం యధావిధిగా వెంచర్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఒక గదిలో శబ్దం రావడంతో ఉడుము వచ్చిందేమోనని ఆ గదిలోకి వెళ్లి చూశాడు. అయితే అక్కడ ఉడుముకు బదులు 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం అందించడంతో.. గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి కొండ చిలువను ఒక సంచిలో బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లివదిలిపెట్టడంతో గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు