తెలంగాణలో మరో జిల్లాలో మెట్రో రైల్ సేవలు..! ఇప్పటికే ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టిన నాయకులు, అధికారులు..

Warangal Metro Neo: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అవ్వడం రోజూ 2 లక్షల మంది ప్రయాణించడంతో తెలంగాణలోని జిల్లాలకు మెట్రో

  • uppula Raju
  • Publish Date - 5:59 am, Mon, 22 February 21
తెలంగాణలో మరో జిల్లాలో మెట్రో రైల్ సేవలు..! ఇప్పటికే ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టిన నాయకులు, అధికారులు..

Warangal Metro Neo: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అవ్వడం రోజూ 2 లక్షల మంది ప్రయాణించడంతో తెలంగాణలోని జిల్లాలకు మెట్రో సర్వీసులను విస్తరించే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అందులో భాగంగా ముందుగా వరంగల్ జిల్లాకు మెట్రో రైళ్ల సర్వీసులను విస్తరించాలని డిసైడ్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌పై వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలాసత్పతి పలు విషయాలను వెల్లడించారు.

వరంగల్‌లో ఉన్న వనరులు, వైశాల్యం, జనాభా, రోడ్డు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, రైల్వే రవాణా ఆధారంగా రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో నియో రైల్ చేపట్టనున్నట్లు తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఫాతిమానగర్, సుబేదారి, అంబేద్కర్ జంక్షన్, హన్మకొండ, ములుగురోడ్, ఎంజీఎం, పోచమ్ మైదాన్, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మహారాష్ట్ర తరహాలో మెట్రోనియో ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనుంది.

గతేడాది డిసెంబర్‌లోనే మహారాష్ట్ర మెట్రో టీమ్ వరంగల్ వచ్చి మొత్తం మ్యాప్ చూసి, ప్రజల రవాణా, రద్దీ అన్నీ లెక్కలోకి తీసుకుంది. అన్ని అంచనాలూ వేసుకొని వరంగల్ జిల్లాకు మెట్రోరైలు సేవలు ఏర్పాటు చేయవచ్చు అని ఫిక్సైంది. అందులో భాగంగానే రూ.కోటితో DPR రెడీ చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్సుంది.

Morning Tiffin: మీరు టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారా.! తస్మాత్ జాగ్రత్త.. ఇక మీకు అంతే సంగతులు..!!