AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పండుగ పూట ఉచితంగా కోళ్లు.. కూర కోసం మసాలాలు.. భలే కానుక

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అవి.. వారికి పండుగ పూట చికెన్ ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఓ సామాజిక వేత. చికెన్ మాత్రమే కాదు.. కూర కోసం మసాలాలు, కూరగాయలు కూడా పంపిణీ చేశాడు..

Telangana: పండుగ పూట ఉచితంగా కోళ్లు.. కూర కోసం మసాలాలు.. భలే కానుక
Chicken
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 4:07 PM

Share

పండుగ పూట కానుకలు అంటే నూతన దుస్తువులు.. లేదంటే స్వీట్స్.. అది కాదంటే ఏవైనా వస్తువులు కానుగా ఇస్తారు.. కానీ దసరా పండుగ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఓ సామాజిక వేత్త కుటుంబం కోళ్లను పంపిణీ చేయడం జనంలో చర్చగా మారింది.. ఆ కోడికూరకు మసాలాలు, కూరగాయలు కూడా పంపిణీ చేయడం ఆసక్తి రేపింది.. దసరా పర్వదినాన ఉచిత కోళ్ల కోసం జనం బారులు తీరారు.  దసరా సందర్భంగా ఈ వినూత్న కానుక పంపిణీ వరంగల్ శివారులోని చింతల్ వద్ద జరిగింది.. ప్రముఖ సామాజిక వేత్త శ్రీనివాస్ కుటుంబం కోళ్లు, కూరగాయలు పంపిణీ చేసి జనంలో చర్చగా నిలిచారు. దసరా పండగ సందర్భంగా పేదలకు వినూత్న కానుకలు ఇస్తున్నామని చెప్పడంతో పేదలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

రెండు వందలకు పైగా నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, కోళ్లు, మసాలాలు పంపిణీ చేసి పండుగపూట వారికి ముక్క రుచి చూపే ప్రయత్నం చేశారు.. పండుగపూట ఈ వినూత్న కానుకలు జనంలో చర్చగా మారాయి. కోళ్ళ కోసం జనం బారులు తీరారు. చివరకు కొందరికి కోళ్లు దొరకక పోవడంతో బ్యాడ్ లక్ అని నిరాశతో వెళ్ళిపోయారు. ప్రతి ఏటా ఇలా ఏదో ఒకటి పేద కుటుంబానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని.. శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?