AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Surekha: అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించా.. ఎవరిపైనా ద్వేషం లేదు: మంత్రి కొండా సురేఖ.. వీడియో

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.. బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం సమంతా.. నాగచైతన్య విడాకులపై మాట్లాడిన కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇటు రాజకీయాల్లో .. అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపాయి.

Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2024 | 4:51 PM

Share

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.. బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం సమంతా.. నాగచైతన్య విడాకులపై మాట్లాడిన కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇటు రాజకీయాల్లో .. అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపాయి.. కొండాసురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున, టాలీవుడ్‌ ప్రముఖులు.. గరం గరం అవుతున్నారు.. ఈ తరుణంలో కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాకుండా.. హన్మకొండలో మీడియాతో కూడా మాట్లాడారు.. తాను ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించానన్నారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం, కోపం లేదన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డానని.. దీనిపై తాను పడిన బాధను మరొకరు పడకూడదని వెంటనే స్పందించాన్నారు.

ఏ విషయంలో తాను బాధపడ్డానో.. ఆ విషయంలో మరొకరిని నొప్పించానని తెలిసి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నానని మంత్రి పేర్కొన్నారు. తాను పడిన బాధ వేరేవాళ్లు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాననని కొండా సురేఖ పేర్కొన్నారు. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశానని.. కేటీఆర్‌ విషయంలో మాత్రం తగ్గేదేలేదని.. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. కేటీఆర్‌ లీగల్‌ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని కొండా సురేఖ పేర్కొన్నారు.

కాగా నాగచైతన్య-సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారంటూ కొండా సురేఖ బుధవారం ఆరోపించారు. ఆమె కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.. ఆమె వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం ఆగ్రహం వ్యక్తంచేసింది. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపేందుకు అక్కినేని నాగార్జున సిద్ధమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..