Warangal: వరంగల్ రైల్వే స్టేషన్‌లో కొండ ముచ్చు హల్‌చల్.. అందరికీ ముచ్చెమటలు పట్టించిందిగా..
వరంగల్ రైల్వే స్టేషన్ టిక్కెట్ కౌంటర్ లో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. కాసేపు ఉరుకులు పరుగులు పెట్టారు.. కోతులు పట్టేవారు వచ్చిన తర్వాత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వరంగల్ న్యూస్, జులై 24: వరంగల్ రైల్వే స్టేషన్ టిక్కెట్ కౌంటర్ లో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. కాసేపు ఉరుకులు పరుగులు పెట్టారు.. కోతులు పట్టేవారు వచ్చిన తర్వాత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరి రైల్వే సిబ్బంది ఎందుకు హఠాత్తుగా హడలెత్తిపోయారు..? నిత్యం రద్దీగా వుండే వరంగల్ రైల్వే స్టేషన్ లో కాసేపు నవ్వులు వెల్లివిరిశాయి. ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కవ్వగా, టిక్కెట్ కౌంటర్ లోని సిబ్బంది వారి సీట్లలో నుండి లేచి పరుగులు పెట్టారు. టిక్కెట్ కౌంటర్ లో కాసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంత హై టెన్షన్ వాతావరణానికి కారణమేంటో తెలుసా? ఒక కొండముచ్చు. హఠాత్తుగా టిక్కెట్ కౌంటర్ లోకి చొరబడ్డ కొండమచ్చు అధికారులు, సిబ్బందికి కొద్దిసేపు ముచ్చెమటలు పట్టించింది. టిక్కెట్ కౌంటర్ లో తిష్టవేసి దాదాపు గంటపాటు హల్ చల్ చేసింది.
కొండమచ్చును చూసి కంగారుపడ్డ సిబ్బంది కాసేపు హడలెత్తిపోయారు..అనంతరం కోతులను పట్టే వారిని పిలిపించి కొండమచ్చును పట్టి అక్కడినుండి తీసుకుపవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల పనితీరు ఎలా ఉందో చూడడానికే వచ్చానన్నట్లు కొండముచ్చు కౌంటర్ వద్ద కూర్చివడం కాసేపు ఫన్నీ గా కనిపించింది. అక్కడున్న వారంతా సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..