AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి రోజే వెంటాడిన మృత్యువు.. ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుదామని వెళ్లారు.. అంతలోనే

జనగామ జిల్లాలో అంతులేని విషాదం వెలుగు చూచింది. పెళ్లి రోజునే ఇద్దరు దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళ పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఓవైపు తల్లిదండ్రులు చనిపోయారనే బాధ, మరోవైపు తీవ్రగాయాలతో తల్లడిల్లిపోతున్న చిన్నారుల దృశ్యాల అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను పిండేశాయి.

పెళ్లి రోజే వెంటాడిన మృత్యువు.. ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుదామని వెళ్లారు.. అంతలోనే
Janagama Accident
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 21, 2025 | 2:59 PM

Share

ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం జనగామ జిల్లాలో జరిగింది. జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. వెనుక సీట్లలో ఉన్న ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే… మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేష్, అతని భార్య దివ్య గా గుర్తించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. సురేష్ కరీంనగర్ లోని. ఓ గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నాడు.. వరుస సెలవులు రావడంతో వారం రోజుల క్రితం వారి స్వగ్రామానికి వెళ్లి అక్కడ వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.. వారి ఆరాధ్య దైవం పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పించారు.. బుధవారం పెళ్లిరోజు కావడంతో తెల్లవారుజామున కారులో కరీంనగర్ కు బయలుదేరారు.. ఈ క్రమంలో వడిచర్ల సమీపంలోని నక్షత్ర గార్డెన్స్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టు దిమ్మని ఢీకొట్టింది..

కారు నడుపుతున్న సురేష్ కు తీవ్రగాయాలడంతో సీట్లోనే అక్కడక్కడ మృతి చెందాడు.. అతని భార్య దివ్యకు కూడా తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది.. ఇక వారి పిల్లలు కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె లోక్షణకు తీవ్ర గాయాలవగా వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియపరచడంతో వారంతా జనగామ కు చేరుకొని బోరన విలపిస్తున్నారు.

వారు పనిచేసే చోట తోటి సిబ్బందితో కలిసి పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవడం కోసం వెళ్లారని ఈ క్రమంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులంతా కన్నీరు మునిరయ్యారు.. ఈ విషాద సంఘటన ప్రతి ఒక్కరూ తల్లడిల్లి పోయేలా చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.