AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etala Rajender: టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసుల దూకుడు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు..!

TS SSC Paper Leak case: తెలంగాణలో టెన్త్ ఎక్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న బండి సంజయ్‌ అరెస్ట్ తర్వాత.. ఇవాళ మరో ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసుల దూకుడు కొనసాగుతోంది.

Etala Rajender: టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసుల దూకుడు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు..!
Etela Rajender
Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2023 | 9:53 AM

Share

TS SSC Paper Leak case: తెలంగాణలో టెన్త్ ఎక్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న బండి సంజయ్‌ అరెస్ట్ తర్వాత.. ఇవాళ మరో ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసుల దూకుడు కొనసాగుతోంది. కమలాపూర్‌లో పేపర్‌ లీక్‌పై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత్ పేపర్‌ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అసలేం జరిగింది..? దీని వెనుక ఎవరున్నారు..? కోణాల్లో పోలీసులు ఆరా తీయనున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీసులు ఈటల రాజేందర్, పీఏకు నోటీసులు ఇవ్వనున్నారు.

ఇటు బండి బెయిల్ పిటిషన్‌.. అటు పోలీసుల కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానాలిచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ హైకోర్ట్‌లో బీజేపీ లీగల్ సెల్‌ లంచ్ మోషన్ పిటిషన్‌ వేయగా.. మరోవైపు సంజయ్‌ని కస్టడీ కోరుతూ వరంగల్ పోలీసుల పిటిషన్ వేశారు. బండి సంజయ్‌ మొబైల్‌ ఫోన్ ఇవ్వలేదని.. ఫోన్ డేటాతో పాటు లీకేజ్‌ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. బండి సంజయ్‌, ప్రశాంత్‌ను వారంపాటు పోలీసులు కస్టడీ కోరనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..